Nanduni Charithamu (Original)

అధికులనీ అధములని నరుని దృష్టిలోనే భేదాలు
శివుని దృష్టిలో అంతా సమానురే ఏ ఏ ఏ ఏ
నందుని చరితము వినుమా ఆ ఆపరమానందము గనుమా
ఆ ఆ పరమానందము గనుమా ఆ
నందుని చరితము వినుమా ఆ ఆ పరమానందము గనుమా
ఆ ఆ పరమానందము గనుమా

ఆదనూరులో మాలవాడలో
ఆదనూరులో మాలవాడలో పేదవాడుగా జనియించి
చిదంబరేశ్వరుని పదాంబుజములే మదిలో నిలిపి కొలిచేను
నందుని చరితము వినుమా ఆ ఆ పరమానందము గనుమా
ఆ ఆ పరమానందము గనుమా

తన యజమానుని ఆనతి వేడెను శివుని చూడగా మనసు పడి
తన యజమానుని ఆనతి వేడెను శివుని చూడగా మనసు పడి
పొలాల సేద్యము ముగించి రమ్మని
పొలాల సేద్యము ముగించి రమ్మని గడువే విధించె యజమాని
యజమాని ఆనతిచ్చిన గడువులో ఏ రీతి పొలము పండిచుటో ఎరుగక
అలమటించు తన భక్తుని కార్యము
ఆ శివుడే నెరవేర్చె ఏ ఏ ఏ ఏ
పరుగున పోయెను చిదంబరానికి భక్తుడు నందుడు ఆత్రమున
పరుగున పోయెను చిదంబరానికి భక్తుడు నందుడు ఆత్రమున
చిదంబరములో శివుని దర్శనం చేయగరాదనె పూజారి
ఆశాభంగము పొందిన నందుడు ఆ గుడి ముందే మూర్చిల్లె
అంతట శివుడే అతనిని బ్రోచి పరంజ్యోతిగా వెలయించె



Credits
Writer(s): Rao Pendyala Nageswara
Lyrics powered by www.musixmatch.com

Link