Sarikotta Chira (From "Pellipustakam")

సరికొత్త చీర ఊహించినాను
సరదాల సరిగంచు నేయించినాను
మనసు మమత పడుగు పేక చీరలో చిత్రించినాను
ఇది ఎన్నో కలల కలనేత
నా వన్నెలరాశికి సిరిజోత
నా వన్నెలరాశికి సిరిజోత

ముచ్చటగొలిపే మొగలిపొత్తుకు
ముల్లూ వాసనా ఒక అందం
అభిమానంగల ఆడపిల్లకు
అలకా కులుకూ ఒక అందం
నీ అందాలన్నీ కలబోశా
నీ కొంగుకు చెంగును ముడివేస్తా
నీ అందాలన్నీ కలబోశా
నీ కొంగుకు చెంగును ముడివేస్తా
ఇది ఎన్నో కలల కలనేత
నా వన్నెలరాశికి సిరిజోత
నా వన్నెలరాశికి సిరిజోత

చురచుర చూపులు ఒకమారు
నీ చిరుచిరు నవ్వులు ఒకమారు
మూతివిరుపులు ఒకమారు
నువు ముద్దుకు సిద్ధం ఒకమారు
నువు ఏ కళనున్నా మాబాగే
ఈ చీర విశేషం అల్లాగే
నువు ఏ కళనున్నా మాబాగే
ఈ చీర విశేషం అల్లాగే

సరికొత్త చీర ఊహించినాను
సరదాల సరిగంచు నేయించినాను
మనసు మమత పడుగు పేక చీరలో చిత్రించినాను
ఇది ఎన్నో కలల కలనేత
నా వన్నెలరాశికి సిరిజోత
నా వన్నెలరాశికీ సిరిజోత



Credits
Writer(s): K V Mahadevan, Arudra
Lyrics powered by www.musixmatch.com

Link