Asa Asaga

(స రి ప మా గ రి స రి సా ని స
స రి ప మా గ రి స రి సా ని స)

ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం
హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం
మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే
మనసు మీటు అనురాగం మా మాటతీరు అంటే
బ్రతుకంటే ఇంత బాగుంటుందా అనుకోదా లోకం
ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం
(స రి ప మా గ రి స రి సా ని స)
ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం
హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం

కనరాని దైవం కరుణించలేదా తల్లి తండ్రులుగా కనిపించి
సేవించు భాగ్యం కలిగించ లేదా శివపార్వతులై కనిపించి
కైలాసంలో కొలువుండి చల్లని మా చెలిమి
కల్మషం మన్నది తెలియనిది మా మమతల కలిమి
ప్రేమకుమించిన పెన్నిధి ఏముంది
(స రి ప మా గ రి స రి సా ని స)
ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం
హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం

హరివిల్లులోని వర్ణాలు అన్నీ మా కన్నులలో నిలవాలి
సిరిమువ్వలోని సరిగమలు అన్నీ మా గుండెలలో పలకాలి
మాలోగిలిలో ప్రతి రాత్రి దీపావళి కాంతి
మాముంగిలిలో ప్రతి ఉదయం ముగ్గుల సంక్రాంతి
పున్నమి నవ్వుల పొదరిళ్ళె మాది
(స రి ప మా గ రి స రి సా ని స)

ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం
హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం
మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే
మనసు మీటు అనురాగం మా మాటతీరు అంటే
బ్రతుకంటే ఇంత బాగుంటుందా అనుకోదా ఈ లోకం
ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం
(స రి ప మా గ రి స రి సా ని స)
(స రి ప మా గ రి స రి సా ని స)
(స రి ప మా గ రి స రి సా ని స)



Credits
Writer(s): S.a. Rajkumar, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link