Oka Maru

ఒక మారు కలిసిన అందం
అలలాగ ఎగసిన కాలం

ఒక మారు కలిసిన అందం
అలలాగ ఎగసిన కాలం
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే
తన అల్లే కధలే పొడుపు
వెదజల్లే కళలే మెరుపు
ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే
అది నన్ను పిలిచినది తరుణం
నులివెచ్చగ తాకిన కిరణం
కన్ను తెరిచిన కలువను చూసానే (చూసానే, చూసానే)

ఒక మారు కలిసిన అందం
అలలాగ ఎగసిన కాలం
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే

పాత పదనిస దేనికది నస
నడకలు బ్రతుకున మార్చినదే
సాయంకాల వేళ
దొరుకు చిరుతిండి
వాసనలు వాడుక చేసిందే
కుచ్చీ కూన చల్లగా (నీ, సా)
నను తాకే కొండ మల్లికా (నీ, సా)
సరిజోడు నేనేగా అనుమానం ఇంకేలా

ఒక మారు కలిసిన అందం
అలలాగ ఎగసిన కాలం
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే

పేరు అడిగితే
తేనె పలుకుల
జల్లుల్లో ముద్దగా తడిసానే
పాలమడుగున
మనసు అడుగున
కలిసిన కనులను వలచానే
మంచున కడిగిన ముత్యమా
నీ మెరిసే నగవే చందమా
కనులార చూడాలే తడి ఆరిపోవాలే

కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే
కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే
తన అల్లే కధలే పొడుపు
వెదజల్లే కళలే మెరుపు
ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే
అది నన్ను పిలిచినది తరుణం
నులివెచ్చగ తాకిన కిరణం
కన్ను తెరిచిన కనులను చూసానే



Credits
Writer(s): J Harris Jayaraj, Rakendu Mouli
Lyrics powered by www.musixmatch.com

Link