Kanupapalalo Prema

కనుపాపల్లో ప్రేమ కలలే చూపినా
మరు నిమిషంలో ప్రేమ కలతే రేపినా
పువ్వే అందునా ముళ్ళనే దాటక
ప్రేమే చేరునా మనసునే వేధించక
ప్రతి కథలో ఇది సహజం
పరులకిదే అపార్ధం

కనుపాపల్లో ప్రేమ కలలే చూపినా
మరు నిమిషంలో ప్రేమ కలతే రేపినా

కడలిని వీడి అడుగులు వెయ్యవు అలలే ఏనాడు
నింగిని వీడి నిలబడగలదా వెన్నెల ఈనాడు
దేహం ఒకరు ప్రాణం ఒకరని దేవుడు కలిపాడు
విధిలా మారి మళ్ళీ తానే విడదీస్తున్నాడు
ఓ దైవమా
ఈ పాపమెవ్వరిది మరి నీదా నాదా
నా కన్నులలో కన్నీరేలా
తుడిచే నేస్తం కనబడదేలా

కనుపాపల్లో ప్రేమ కలలే చూపినా
మరు నిమిషంలో ప్రేమ కలతే రేపినా

హృదయంలో తొలి ఉదయంలా తన ప్రేమే వెలిగింది
ఊహకు అందని ఉపద్రవమేదో నను బలి చేసింది
కనులకు చూపై పెదవికి నవ్వై నను మురిపించింది
ఆ కన్నులలోనే కన్నీరై కలవరపరిచింది
ఓ నేస్తమా, ఓ నేస్తమా
నా కన్న నిన్నే మిన్నగా ప్రేమించా ప్రేమా
అడుగే పడదు అలికిడి లేక
మరణంలోను నిను మరవను ఇంకా

కనుపాపల్లో ప్రేమ కలలే చూపినా
మరు నిమిషంలో ప్రేమ కలతే రేపినా
పువ్వే అందునా ముళ్ళనే దాటక
ప్రేమే చేరునా మనసునే వేధించక
ప్రతి కథలో ఇది సహజం
పరులకిదే అపార్ధం

కనుపాపల్లో ప్రేమ కలలే చూపినా
మరు నిమిషంలో ప్రేమ కలతే రేపినా



Credits
Writer(s): Sundar C Babu, Kondeti Chinnicharan
Lyrics powered by www.musixmatch.com

Link