Konchem Istam Konchem Kastam

భజభజరే ప్రేమికా పట్టుకో చెలి పాదం
బాపురే బాలికా తీయకే నా ప్రాణం
అనుకుంటే సరా ఒకటే ఊదరా
చెబితే వినదా ఉరికే తొందర

కొంచెం ఇష్టం ఉంటే కొంచెం కష్టం అంటే
ఒప్పుకోక తప్పదంటూ తగువే తగునా
ఎంతో ఇష్టం ఉన్నా ఎంతో కష్టం అన్నా
గూటితో కొండెత్తమంటే సరేలే అననా

అనగనగా జాలిగా సాగనీ మన గాథ
ఎంతకీ తేలదా ఏమిటీ యమ బాధ
ప్రతి సారి ఇలా మొదలైతే ఎలా
సుడిలో పడవై కడ తేరేదెలా

కొంచెం ఇష్టం ఉంటే కొంచెం కష్టం అయినా
కంచి దాకా చేర్చలేనా నిను నా వెనుక
ఎంత ఇష్టం ఉంటే అంత కష్టం ఉందే
ఆదిలోనే హంస పాదం ఆవకే చిలకా

ఎన్నడూ చేరమే తిన్నగా తుది తీరం
ఆపే ఆపదా కాదే పూపొద
బెదురెందుకట నేనున్నా కదా
కొంచెం ఇష్టం వెంట కొంచెం కష్టం వెంట
ప్రేమ దేశం చేరాల్సిందే అనుకో సజనా
ఎంతో దూరం ఉన్నా ఎంత కాలం అయినా
ప్రేమ కోసం పరుగులు తీద్దాం పదవే లలనా

రాజునే బానిసా చెయ్యదా చెలి బంధం
సమయంతో సదా సమరం చేయదా
వలచే హృదయం గెలిచే తీరదా

కొంచెం ఇష్టం పుడితే కొంచెం కష్టం పెడితే
అంతు చూసే పంతం అవదా పొంగే ఆశ
కోరే మజిలీ దాకా పోరే గజనీ లాగా
ఓటమంటే కోట చేరే బాటనుకోదా

మతి చెడితే భామరో మనది కాదిక లోకం
మునిగితే ప్రేమలో తేలనీయదు మైకం
మెడలో ఈ ఉరి పడుతున్నా మరి
ఇది పూదండే అనదా ఊపిరి
కొంచెం ఇష్టం ఉన్నా కొంచెం కష్టం అయినా
తేనెపట్టే రేపుతుంది ఈ అల్లరీ
ఇంతకు ముందే ఉన్న ఎందరి history విన్నా
నువ్వు నేనే ఈవ్ and ఆడం అంతే సరి



Credits
Writer(s): Mahadevan Shankar, Sastry Seetharama, Mendonsa Peter, Noorani Ehsaan
Lyrics powered by www.musixmatch.com

Link