Kalalu Kane

కలలు కనే కాలాలు, కరిగిపోవు సమయాలు
చెరిగిపోని ముగ్గే వేయునా
చూపు రాయు లేఖలు, దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా
ఇది చేరువ కోరే తరుణం
ఇరు ఎదలలో మెల్లని చలనం
ఇక రాత్రులు ఇంకొక నరకం వయసుల అతిశయం
ఇది కత్తిన నడిచే పరువం
నిత్య కలలతో తమ తమ రూపం
వీళ్ళు కోరును నిప్పుతో స్నేహం దేవుని రహస్యము
లోకంలో తీయని భాష, హృదయంలో పలికే భాష
మెలమెల్లగా వినిపించే ఘోష
కలలు కనే కాలాలు, కరిగిపోవు సమయాలు
చెరిగిపోని ముగ్గే వేయునా
చూపు రాయు లేఖలు, దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా

తడి కాని కాళ్ళతోటి కడలికేది సంబంధం
నే వేరు నువ్వేరంటే చెలిమికేది అనుబంధం
ఎగరలేని పక్షికేలా పక్షి అనెడి ఆ నామం
తెరవలేని మనస్సుకేలా కలలుగనే ఆరాటం
ఒంటరిగా పాదాలు ఏమి కోరి సాగినవో
జ్యోతి వెలిగించిన చేతి కొరకు వెతికినవో
తల్లైనా కొన్ని హద్దులు ఉండును, స్నేహంలో అవి ఉండవులే
ఎగిరొచ్చి కొన్ని ఆశలు దూకితే ఆపుట ఎవరికి సాధ్యములే
ఆ... కలలు కనే కాలాలు, కరిగిపోవు సమయాలు
చెరిగిపోని ముగ్గే వేయునా
చూపు రాయు లేఖలు, దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా

ఏవైందో ఏమో గాలికి తేమ కాస్త తగ్గెనులే
ఏకాంతం పూసుకొని సంధ్యవేళ పిలిచెనులే
తెల్లవారుజాములన్నీ నిద్రలేక తెలవారే
కనులుమూసి తనలో తానే మాట్లాడ తోచెనులే
నడిచేటి దారిలో నీ పేరు కనిపించా
గుండెల్లో ఏవో గుసగుసలు వినిపించే
అపుడపుడు చిరుకోపములాగ కరిగెను ఎందుకు మంచులాగ
భూకంపం అది తట్టుకోగలము, మది కంపం అది తట్టుకోలేం
ఆ... కలలు కనే కాలాలు, కరిగిపోవు సమయాలు
చెరిగిపోని ముగ్గే వేయునా
చూపు రాయు లేఖలు, దిశలు మారు గమ్యాలు
ఒంటరిగా పయనం చేయునా



Credits
Writer(s): Yuvan Shankar Raja, Shiva Ganesh
Lyrics powered by www.musixmatch.com

Link