Rangu Rangu

రంగు రంగు వాన ఇది నంగనాచి వాన
నను ముట్టుకుంటే ముద్దైపోనా
చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన
నను చుట్టుకుంటే మంటైపోనా
రానా దరి రానా తెర తెంపేయనా
శానా పరిశానా సిరి వంపేయనా
కానా జాతకానా చలి చెంపేయనా
మైనా తడిమేయినా తడి సంపాదన
నాకు నీకు, నీకు నాకు వానే కదా వంతెన
రంగు రంగు వాన ఇది నంగనాచి వాన
నను ముట్టుకుంటే ముద్దైపోనా
చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన
నను చుట్టుకుంటే మంటైపోనా

దూదిలాగ ఒకటి, అరె సూదిలాగ ఒకటి
చిరు చినుకులన్నీ కురిసే ఈ పైన
బంతిలాగా ఒకటి, అణుబాంబు లాగ ఒకటి
తొలి చినుకులన్నీ తగిలాయి లోన
చేయాలంది వాన నీతోనే రవాణా
చూడాలంది వాన నీలోనే దిఖానా
బావిలోన వేసుకోరా మనసుపైకి నిచ్చెన
చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన
నను చుట్టుకుంటే మంటైపోనా
రంగు రంగు వాన ఇది నంగనాచి వాన
నను ముట్టుకుంటే ముద్దైపోనా

చినుకు చీర కట్టి, అరె ఒణుకు పూలు పెట్టి
వరదల్లె కదిలి వస్తుంది జాణ
మబ్బు గొడుగు పట్టి, మెరుపిట్టా అడుగుపెట్టి
హరివిల్లులాగ ఒళ్ళే పరిచేనా
ముంచేసింది వాన నీతోని సుఖానా
పంచేసింది వాన నాలోని నమూనా
వానలాగా చల్లిపోనా వలపు మూల మూలన
రంగు రంగు వాన ఇది నంగనాచి వాన
నను ముట్టుకుంటే ముద్దైపోనా
చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన
నను చుట్టుకుంటే మంటైపోనా
రానా దరి రానా తెర తెంపేయనా
శానా పరిశానా సిరి వంపేయనా
కానా జాతకానా చలి చెంపేయనా
మైనా తడిమేయినా తడి సంపాదన
నాకు నీకు, నీకు నాకు వానే కదా వంతెన
రంగు రంగు వాన ఇది నంగనాచి వాన
నను ముట్టుకుంటే ముద్దైపోనా
చెంగు చెంగు వాన ఇది పొంగులూరి వాన
నను చుట్టుకుంటే మంటైపోనా



Credits
Writer(s): Vijay Ebenezer, Ramajogiah Sastry
Lyrics powered by www.musixmatch.com

Link