Happy New Year

Happy new year వచ్చేసింది జోరుగా
Hearty welcome చెప్పేదామా హాయిగా
కొత్త కొత్త ఊహల్లో తేలిపో dear
మనసులోని ఆశల్ని పంచుకో brother
గుండెలోని భావాలు గుప్పుమన్న ఈ వేళ
కదిలెల్లే కాలపు కన్నెకి టాటా చెబుదామా
జనవరితో అడుగులు వేస్తూ ముందుకి పోదామా
Happy new year వచ్చేసింది జోరుగా
Hearty welcome చెప్పేదామా హాయిగా

తొలి తొలి చూపుతో రవికుల సోముని వలచిన జానకి మురిసినది
కన్నుల వెన్నెల కురిసినది

అదేం మోహమో, అదేం దాహమో
కలయిక లోని మాధుర్యమో
ఇదేం సౌఖ్యమో, ఇదేం స్వర్గమో
మనసును దోచే సౌందర్యమో
అవుననే అన్నది అందెల రవళి
మోజులే తీరని మౌనమే వదిలి
నీ శ్వాసల ఊయల లోనే నే ఊయలలూగాలి
నీ అందం కన్నుల విందై చిందులు వేయాలి
అలలా అలలా వచ్చేసింది యవ్వనం
నువ్వు నేను కలిసే క్షణమే శాస్వతం

కలత నిదురలో, కలల నీడలో
నా పెదవులపై నీ నామమే
పూల ఋతువులో, తేనే చినుకులో
కనిపించేది నీ రూపమే
కోరికే తారకై చేర రమ్మంటే
చేరువై ఆకలే తీర్చుకొమ్మంటే
కనురెప్పల పల్లకిలో నిన్నెత్తుకు పోతాలే
చిరుగాలుల సవ్వడిలో నిన్నల్లకు పోతాలే
Happy new year వచ్చేసింది జోరుగా
Hearty welcome చెప్పేదామా హాయిగా
కొత్త కొత్త ఊహల్లో తేలిపో dear
మనసులోని ఆశల్ని పంచుకో brother
గుండెలోని భావాలు గుప్పుమన్న ఈ వేళ
కదిలెల్లే కాలపు కన్నెకి టాటా చెబుదామా
జనవరితో అడుగులు వేస్తూ ముందుకి పోదామా
Happy new year వచ్చేసింది జోరుగా
Hearty welcome చెప్పేదామా హాయిగా



Credits
Writer(s): S.a. Rajkumar, Bhauvanachandra
Lyrics powered by www.musixmatch.com

Link