Repe Lokam

రేపే లోకం ముగిసేనంటే చెలియా ఎం చేస్తావు
రేపే లోకం ముగిసేనంటే చెలియా ఎం చేస్తావు
కన్నులు తెరిచి కాలం మరిచి నింగిని కన్నుల నింపుకుని
ముందుకు ఒరిగి ఆఖరిసారిగా ప్రేమగా భూమికి ముద్దులిచ్చి
నా ఆయువు నీకే ఇమ్మని అంటూ ఆ దేవుడిని వేడుకుంటాలే
రేపే లోకం ముగిసేనంటే చెలియా ఎం చేస్తావు

రేపే లోకం
రేపే లోకం ముగిసేనంటే నువ్వేంచేస్తావు
ఒక నూరేళ్ళ జీవితమంతా ఈనాడే జీవిస్తా
ని పెదవులపైన పెదవులు చేర్చి కన్నులే మూసుకుంటా
మరణం వరకు మమతలు పంచి మరణాన్నే మరిపిస్తాలే

రేపే లోకం ముగిసేనంటే చెలియా ఎం చేస్తావు
రేపే లోకం ముగిసేనంటే చెలియా ఎం చేస్తావు
కన్నులు తెరిచి కాలం మరిచి నింగిని కన్నుల నింపుకుని
ముందుకు ఒరిగి ఆఖరిసారిగా ప్రేమగా భూమికి ముద్దులిచ్చి
నా ఆయువు నీకే ఇమ్మని అంటూ ఆ దేవుడిని వేడుకుంటాలే

వలపు అనేది నిలిచే వరకు భూలోకం ముగియదులే
కోటి మెరుపులు కోసేస్తున్నా ఆ గగనం చీలదులే
ప్రళయాలెన్నో రాని పోనీ జీవనయానం సాగవులే
తనువేమైనా మనవేమైనా అనురాగం ఆగదులే

రేపే లోకం ముగిసేనంటే ప్రియా ఎం చేస్తావు
రేపే లోకం ముగిసేనంటే ప్రియా ఎం చేస్తావు
నింగికి నేలకి వందనమంటూ నిను నా ఒడిలో చేర్చుకుంటా
వన్నెల విరులా పానుపు వేసి నాలో నిన్నే నిలుపుకుంటా
నాలో ఊపిరి ఉన్నంతవరకు నీ కావలినై నిలిచి ఉంటాలే
రేపే లోకం ముగిసేనంటే చెలియా ఎం చేస్తావు



Credits
Writer(s): A R Rahman, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link