Pidikita Thalambrala

పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వీనె పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వీనె పెండ్లి కూతురు

పేరుకల జవరాలె పెండ్లి కూతురు (పెండ్లి కూతురు)
పెద్ద పేరుల ముత్యాల మేడ పెండ్లి కూతురు (పెండ్లి కూతురు)
పేరుకల జవరాలె పెండ్లి కూతురు (పెండ్లి కూతురు)
పెద్ద పేరుల ముత్యాల మేడ పెండ్లి కూతురు (పెండ్లి కూతురు)
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
విభు పేరుకుచ్చు సిగ్గువడీ పెండ్లి కూతురు

పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వీనె పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వీనె పెండ్లి కూతురు

బిరుదు పిండము బెట్టె పెండ్లి కూతురు
నెర బిరుదు మగని కంటె పెండ్లి కూతురు
బిరుదు పిండము బెట్టె పెండ్లి కూతురు
నెర బిరుదు మగని కంటె పెండ్లి కూతురు
పిరిదూరి నప్పుడే పెండ్లి కూతురూ
పిరిదూరి నప్పుడే పెండ్లి కూతురూ
పతి బెరరేచీ నిదివో పెండ్లి కూతురు

పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వీనె పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వీనె పెండ్లి కూతురు

పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు (పెండ్లి కూతురు)
నేడే పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు (పెండ్లి కూతురు)
పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు (పెండ్లి కూతురు)
నేడే పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు (పెండ్లి కూతురు)
గట్టిగ వేంకటపతి కౌగిటను
గట్టిగ వేంకటపతి కౌగిటను
వడి పెట్టిన నిధానమయిన పెండ్లి కూతురు

పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వీనె పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వీనె పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వీనె పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వీనె పెండ్లి కూతురు



Credits
Writer(s): Rayancha, Traditional
Lyrics powered by www.musixmatch.com

Link