Ra Ra Krishnayya

అటు ఇటు నను అల్లుకుంది సిరి సిరి హరిచందనాల నవ్వు, నవ్వు, నవ్వు
ఎవరని మరి వెతకగ ఆ నవ్వులన్ని రువ్వుతోంది నువ్వు నువ్వు, నువ్వు
కురిపించావిలా వినలేని వెన్నెలా నాపైనా
పలికించావురా ప్రాయన్ని వీణలా
చెలి అధరాల మధురాలు ఆస్వాదించేలా

ఇటు రార ఇటు రార కృష్ణయ్యా
నేనే రాధా నే నీ రాధా
ఇటు రార ఇటు రార కృష్ణయ్యా
అందం గంధం నీది కాదా

మనసిది బయటపడదు మాట అనదు ఏంటిలా
అలజడి తీరేదెలా
సొగసిది కుదుట పడదు వలపు మెరుపుతీగలా
నీ ఒడి చేరేదెలా
ఎపుడూ లేదిలా ఎగసిందే ఎద
ప్రియా సరసాలకు నోరూరిందా

ఇటు రారా ఇటు రారా కృష్ణయ్యా
నేనే రాధా నే నీ రాధా
ఇటు రారా ఇటు రారా కృష్ణయ్యా
అందం గంధం నీది కాదా

ఇటు రార ఇటు రార కృష్ణయ్యా
నేనే రాధా నే నీ రాధా
ఇటు రార ఇటు రార కృష్ణయ్యా
అందం గంధం నీది కాదా



Credits
Writer(s): Ramajogayya Sastry, Achu
Lyrics powered by www.musixmatch.com

Link