Choododde Nannu (From "Aaru")

చూడొద్దే నన్ను చూడొద్దే చురకత్తిలాగ నన్ను చూడొద్దే
వెళ్ళొద్దే వదిలెళ్ళొద్దే మది గూడు దాటి వదిలెళ్ళొద్దే
అప్పుడు పంచిన నీ మనసే అప్పని అనవొద్దే

ఇప్పుడు పెరిగిన వడ్డీతో ఇమ్మని అడగొద్దే
చూడొద్దే నన్ను చూడొద్దే చురకత్తిలాగ నన్ను చూడొద్దే
వెళ్ళొద్దే వదిలెళ్ళొద్దే మది గూడు దాటి వదిలెళ్ళొద్దే

వద్దూ వద్దంటు నేనున్నా వయసే గిల్లింది నువ్వేగా
పో పో పొమ్మంటు నేనున్నా పొగలా అల్లింది నువ్వేగా
నిదరోతున్న హృదయాన్ని లాగింది నువ్వేగా
నలుపై ఉన్న రాతిరికి రంగులు నువ్వేగా
నాతో నడిచే నా నీడ నీతో నడిపావే
నాలో నిలిచే నా ప్రాణం నువ్వై నిలిచావే

చూడొద్దే నన్ను చూడొద్దే చురకత్తిలాగ నన్ను చూడొద్దే
వెళ్ళొద్దే వదిలెళ్ళొద్దే మది గూడు దాటి వదిలెళ్ళొద్దే

వద్దూ వద్దంటు నువ్వున్నా వలపే పుట్టింది నీ పైన
కాదూ కాదంటు నువ్వున్నా కడలే పొంగింది నాలోన
కన్నీళ్ళ తీరంలో పడవల్లే నిలుచున్నా
సుడిగుండాల శృతిలయలో పిలుపే ఇస్తున్నా
మంటలు తగిలిన పుత్తడిలో మెరుపే కలుగునులే
ఒంటిగ తిరిగిన ఇద్దరిలో ప్రేమే పెరుగునులే

చూడొద్దు నను చూడొద్దు చురకత్తిలాగ నను చూడొద్దు.
వెళ్ళొద్దు వదిలెళ్ళొద్దు మది గూడు దాటి వదిలెళ్ళొద్దు
అప్పుడు పంచిన నా మనసే అప్పని అనలేదే
గుప్పెడు గుండెల చెలిఊసే ఎప్పుడు నీదేలే

Credits
Writer(s): Devi Sri Prasad, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link