Chaala Bagundi

పగటి కలొ
పడుచు వలొ
తననిలాగే తలపులలో
పగటి కలొ
పడుచు వలొ
తననిలాగే తలపులలో
చాలా బాగుంది అనుకుంది మది లోలో
తానేం చూసింది అనుకోని మలుపుల్లో
పరవశమో తగని శ్రమో అసలిది ఏమో

తొలి సరదా పరుగులెడుతున్నది ఇంతలా
ఎటు పోతుందో అడిగితె చెపుతుందా
నాపైనే తిరగ బడుతున్నదె ఇంకెలా
ఆశల వేగాన్నీ ఆపె వీలుందా
తెగబడి తడబడి వడి వడి ఇదేమి అలజడో
తగుజతి కనబడి వెంటాడే ఊహలలో
చాలా బాగుంది అనుకుంది మది లోలో
తానేం చూసింది అనుకోని మలుపుల్లో

అపుడెపుడో తగిలినది మనసుకు నీ తడి
అని ఇపుడిపుడే గురుతుకు వస్తోంది
తొలకరిలో చినుకు చెలి చేసిన సందడి
నేలకి తెలిసేలా చిగురులు వేసింది
చెలిమికి చిగురులు
తొడగగా సరైన సమయము
ఇది కదా అనుకొని ఎదురేగాలో ఏమో
చాలా బాగుంది అనుకుంది మది లోలో
తానేం చూసింది అనుకోని మలుపుల్లో
పరవశమో తగని శ్రమో అసలిది ఏమో



Credits
Writer(s): Vishal Lalit Jain, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link