Sita Seemantham

సీత సీమంతం రంగరంగ వైభవములే
ప్రేమా ఆనందం నింగి నేల సంబరములే
కోశల దేశమే మురిసి కోయిలై ఆశల పల్లవి పాడే
పున్నమి ఆమని కలసి వెల్లువై కన్నుల పండుగ చేసే
మన శ్రీరాముని ముద్దుల రాణి సీతమ్మౌతుందే

సీతా సీమంతం రంగ రంగ వైభవములే
ప్రేమా ఆనందం నింగి నేల సంబరములే

అమ్మలక్కలంత చేరి చెమ్మ చెక్కలాడి పాడి చీరలిచ్చి సారెలిచ్చిరే
జుట్టు దువ్వి నవ్వురువ్వి ముత్యమంత బొట్టుపెట్టి భర్త గారు దగ్గరయ్యెనే

(అమ్మలక్కలంత చేరి చెమ్మ చెక్కలాడి పాడి చీరలిచ్చి సారెలిచ్చిరే
జుట్టు దువ్వి నవ్వురువ్వి ముత్యమంత బొట్టుపెట్టి భర్త గారు దగ్గరయ్యెనే)

కాశ్మీరమే కుంకుమ పువ్వే కావిళ్ళతో పంపే
కర్ణాటక రాజ్యం నుంచి కస్తూరియే చేరే
అరె వద్దు వద్దు అంటున్న ముగ్గురు అత్తలు కూడి ఒక్క పనిచేయనీవరే

సీతా సీమంతం రంగ రంగ వైభవములే
ప్రేమా ఆనందం నింగి నేల సంబరములే

పుట్టినింటి వారువచ్చి దగ్గరుండి ప్రేమతోటి పురుడు పోసినట్టు జరుగులే
మెట్టినింటి వారునేడు పట్టరాని సంబరముతో పసుపు కుంకుమిచ్చినట్టులే

(రామనామ కీర్తనాలు మారుమ్రోగు ఆశ్రమాన కానుపింక తేలికౌనులే
అమ్మ కడుపు చల్లగాను అత్తకడుపు చల్లగాను తల్లిబిడ్డలిల్లుచేరులే)

ముత్తైదుల ఆశీస్సులతో అంతా నీకు శుభమే
అటు ఇటు బంధం ఉన్న చుట్టాలంతా మేమే
ఎక్కడున్న నువుగాని చక్కనైన కల్యాణి రామరక్ష నీకు ఎప్పుడు
దేవీ సీమంతం సంతసాల వంత పాడెనే
ప్రేమా ఆనందం గుండెలోన నిండిపోయెనే
అంగనలందరు కలిసి కోమలికి మంగళ హారతులనిరే
వేదము గానము చేసే ఆశ్రమము చల్లని దీవెనెలొసగే
శుభాయోగాలతో వెలిగే సాగే సుతునీ కనవమ్మా
దేవీ సీమంతం సంతసాల వంత పాడెనే
ప్రేమా ఆనందం గుండెలోన నిండిపోయెనే



Credits
Writer(s): Ilayaraja, Jonnavitthula
Lyrics powered by www.musixmatch.com

Link