Cheliya

మండే సూరీడల్లే నిండే నిప్పులల్లే
భగ భగ మన్నది నీ హృదయం

పొంగే ఉప్పెనల్లే మింగే మృత్యువల్లే
పగ పగ అన్నది నా హృదయం

ఇలా ఇలా జ్వలించుతోంది నా ఎద
ఎడారిలా చలించే నా కధ

చెలియా చెలియా చెలియా చెలియా
మసి చేస్తుందే ఈ దూరం

చెలియా చెలియా నా ఊపిరిలో
నిండే ఉందే నీ ప్రాణం

పువ్వేదో నన్ను తాకితే నవ్వేదో నన్ను చేరితే
నువ్వేదో అన్న తీపి జ్ఞాపకం

వెన్నెల్లు వెన్ను మీటితే కన్నీళ్లు కన్ను దాటితే
నన్నల్లుకున్న చూపు జ్ఞాపకం

ప్రతీ దినం ప్రతీ క్షణం
నీ ప్రేమలో ప్రదక్షణం
తెగించమంది నన్నే తక్షణమ్.మ్ మ్

చెలియా చెలియా చెలియా చెలియా
మసి చేస్తుందే ఈ దూరం

చెలియా చెలియా నా ఊపిరిలో
నిండే ఉందే నీ ప్రాణం

ప్రయాణమాయె జీవితం
ప్రమాదమాయె నా పథం
శరీరమాయె మారనాయుధమ్

నరాల రక్త సాగరం
కణాల అగ్ని పర్వతం
కలేసి రాసె మృత్యుశాసనం

ఒకే వ్రతం వినాశనం
ఒకే విధం విధ్వంసనం
నా వేటకింక లేదే విరమణం

ఓ' చెలియా చెలియా చెలియా చెలియా
మసి చేస్తుందే ఈ దూరం

చెలియా చెలియా నా ఊపిరిలో
నిండే ఉందే నీ ప్రాణం



Credits
Writer(s): G Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link