Nammaka Tappani (From "Bommarillu")

నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా
ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా
నీ రూపం నా చూపులనొదిలేనా
ఎందరితో కలిసున్నా నెనొంటరిగానే ఉన్నా
నువ్వొదిలిన ఈ ఏకాంతంలోన
కన్నులు తెరిచే ఉన్నా నువు నిన్నటి కలవే ఐనా
ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా
నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా

ఈ జన్మంతా విడిపోదీ జంట
అని దీవించిన గుడిగంటను ఇక నా మది వింటుందా
నా వెనువెంట నువ్వే లేకుండ
రోజూ చూసిన ఏ చోటైనా నను గుర్తిస్తుందా
నిలువున నను తడిమి అలా వెనుదిరిగిన చెలిమి అల
తడి కనులతో నిను వెతికేది ఎలా

నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా

నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో
కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయనుకోనా
నా ఊహల్లో కలిగే వేదనలో
ఎన్నాళ్ళైనా ఈ నడిరాతిరి గడవదు అనుకోనా
చిరునవ్వుల పరిచయమా సిరిమల్లెల పరిమళమా
చేజారిన ఆశల తొలి వరమా

నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా
ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా
నీ రూపం నా చూపులనొదిలేనా

Credits
Writer(s): Devi Sri Prasad, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link