Amma Brahma Devudo

హుయ్ ఢముకేయ్ డుం డుం డిగా
సందడి సెయ్ తమాషాగా
అంగరంగ వైభోగంగా
సంబరం వీధుల్లో సేరి శివమెత్తంగా

హుయ్ దరువై తద్దినాక
అడుగేయరా అదిలెక్క
సామిరంగా సిందాడంగా
శీనయ్యే ఏడుకొండలు దిగి కిందికి రాగ

అమ్మ బ్రహ్మ దేవుడో
కొంప ముంచినావురో
ఎంత గొప్ప సొగసురో
యాడ దాచినావురో
పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు
రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో
అసలు భూలోకం
ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం
స్వర్గానికి చెంది ఉంటదా

కనురెప్పలు పడనప్పుడు
కల కల్లపడదుగా
కనుకిప్పుడు ఎదరున్నది కళ్ళైపోదుగా
కనురెప్పలు పడనప్పుడు
కల కల్లపడదుగా
కనుకిప్పుడు ఎదరున్నది కళ్ళైపోదుగా
ఒకటై సిన్నాపెద్ద
అంతా చుట్టూ చేరండి
థకథై ఆటాడించి సోదం సూడండి

చెంద్రుడిలో కుందేలు సందెల్లో అందాలు
మన ముంగిట్లో కథాకళి ఆడేనా

అసలు భూలోకం
ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం
స్వర్గానికి చెంది ఉంటదా
అమ్మ బ్రహ్మ దేవుడో
అరె కొంప ముంచినావురో
ఎంత గొప్ప సొగసురో
యాడ దాచినావురో

మహా గొప్పగా మురిపించగా
సరికొత్త సంగతి
తల తిప్పగ మనసొప్పక
నిలిచే జాబిలీ
మహా గొప్పగా మురిపించగా
సరికొత్త సంగతి
తల తిప్పగ మనసొప్పక
నిలిచే జాబిలీ
అబ్బనా తన్నా మన్నా
కదం తొక్కే పదాన
తపన తన మన
తేడా లేవైనా
తందానా తానాన కిందైనా మీదైనా
తల వంచేనా తెల్లార్లు తిల్లాన

అసలు భూలోకం
ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనక ఈ చిత్రం
స్వర్గానికి చెంది ఉంటదా
అమ్మ బ్రహ్మ దేవుడో
కొంప ముంచినావురో
ఎంత గొప్ప సొగసురో
యాడ దాచినావురో
పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు
రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో
అసలు భూలోకం
ఇలాంటి సిరి చూసి ఉంటదా

హుయ్ ఢముకేయ్ డుం డుం డిగా
సందడి సెయ్ తమాషాగా
అంగరంగ వైభోగంగా
సంబరం వీధుల్లో సేరి శివమెత్తంగా
హుయ్ దరువై తద్దినాక
అడుగేయరా అదిలెక్క
సామిరంగా చిందాడంగా
శీనయ్య ఏడుకొండలు
దిగి కిందికి రాగ



Credits
Writer(s): Raj-koti, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link