Swachamaina Prematho

లలిత్.! హా చెప్పండి. నువ్వు ఎప్పుడైనా అమ్మాయితో ఎంజాయ్ చేసావా.
అంటే. అదే ఏ అమ్మాయినైనా.
అయ్యయ్యో లేదండి. లేదా.?
అస్సలు ఆడదానిపైన నీ అభిప్రాయం.?
స్వచ్ఛమైన ప్రేమతో మచ్చలేని మనసు ఉన్న
అచ్చమైన ఆడది సృష్టి మూలమైనది
కళ్ళలోన కరుణను గుండె నిండా సహనమంతా
నింపుకున్న మగువలు అవనితో సమానము
తన సుఖమే ఏనాడూ కోరక
నిలిచెనులే స్త్రీ త్యాగ మూర్తిగా
ధర్మార్థ కామాల సారమే కదా.

స్వచ్ఛమైన ప్రేమతో మచ్చలేని మనసు ఉన్న
అచ్చమైన ఆడది సృష్టి మూలమైనది
కళ్ళలోన కరుణను గుండె నిండా సహనమంతా
నింపుకున్న మగువలు అవనితో సమానము
తన సుఖమే ఏనాడూ కోరక
నిలిచెనులే స్త్రీ త్యాగ మూర్తిగా
ధర్మార్థ కామాల సారమే కదా.

స్వచ్ఛమైన ప్రేమతో మచ్చలేని మనసు ఉన్న
అచ్చమైన ఆడది సృష్టి మూలమైనది
very interesting . చాలా బావుంది ఆ తర్వాత.

చెరగని చరితలై. మలగని ప్రమిదలై
తరగని వరములై. వెలిగెలే తారలై
ఇల్లాలిగా. చెల్లాయిగా.
ఈ జన్మనిచ్చు తల్లిగా.
కష్టాలలో సుఖాలలో
వెన్నంటి వెంట ఉండదా.
మగాడి బ్రతుకు ఎన్నడూ
ఎడారిలాగా మారకుండా
కంటికేమో రెప్పలాగ కాలమంత నిలవలేదా
మూడు ముళ్ల పెళ్లితో ఏడేడు జన్మలుండదా.

ఇల్లాలిగా. చెల్లాయిగా.
ఈ జన్మనిచ్చు తల్లిగా.
ఆహా. ఆడ జన్మకి ఇంత అర్థం ఉందా.?

స్వచ్ఛమైన ప్రేమతో మచ్చలేని మనసు ఉన్న
అచ్చమైన ఆడది సృష్టి మూలమైనది
కళ్ళలోన కరుణను గుండె నిండా సహనమంతా
నింపుకున్న మగువలు అవనితో సమానము

ప్రణయము ప్రళయము కలిసిన హృదయము
మమతలా నిలయమే మధువులా ఉదయమే
నిండైన చీర కట్టుతో సింధూర వర్ణ బొట్టుతో
జల్లోన పూల మాలతో అలంకరణకు గుర్తుగా
బంగారమంటి గుణములున్న
ఆడ జన్మ గొప్పదేగా
ఒక్క మాట చెప్పమంటే అద్దమంటి హృదయమున్న
ఈ ఆడ జన్మకు నిలువెత్తు రూపం నీవేగా...

స్వచ్ఛమైన ప్రేమతో మచ్చలేని మనసు ఉన్న
అచ్చమైన ఆడది సృష్టి మూలమైనది
కళ్ళలోన కరుణను గుండె నిండా సహనమంతా
నింపుకున్న మగువలు అవనితో సమానము
తన సుఖమే ఏనాడూ కోరక
నిలిచెనులే స్త్రీ త్యాగ మూర్తిగా
ధర్మార్థ కామాల సారమే కదా.
Edited By.
రాజా మణికంఠ



Credits
Writer(s): Sashi, M.g.k. Praveen
Lyrics powered by www.musixmatch.com

Link