Evaro Nenevaro

ఎవరో ఎవరో నేనెవరో నువ్వే లేని నేనెవరో
నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా
ఓ చిరుగాలి వస్తావా
ప్రశ్నకు బదులే ఇస్తావా
కన్నుల నీటిని తుడిచేస్తావా నువ్వైనా
ఇది కలయా కలయా
మరి నిజమా నిజమా
ఇది కలయే అయితే ఇకమై కరిగిపోతుందే
ఇది నీడా నీడా
మరి వెలుగా వెలుగా
ఇది నీడే అయితే నిశిలో కలిసిపోతుంది

ఎవరో ఎవరో నేనెవరో నువ్వే లేని నేనెవరో
నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా

నిన్నే వీడి నే తొలిసారి నడుస్తున్నా ఒంటరిగా
నీ వంతు గాలిని నా ఎద నిండా పీలుస్తున్నా ప్రియమారా
చెరి సగమై రేయి పగలు ఉంటేనే సృష్టికి అందం
ఒక సగము వేరైపోతే అది శాపం
తియతియ్యని గతముంది
గతమే ఇక మిగిలింది
ఏనాటికి మానదు మానదు నా గాయం

ఎవరో ఎవరో నేనెవరో నువ్వే లేని నేనెవరో
నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా

స్వప్నాలలో ఒక సౌందర్యం తారాడెనే తానెవరు
ఆ మేలి ముసుగును తొలగించేస్తే ఆ వేషమై అది నువ్వు
మందార పెదవే తెరిచి
మధురంగా నవ్వే విసిరి
వెళుతుంటే ఏమౌతానో ఇకపైనా
తన వైపే చూస్తున్నా, తననే గమనిస్తున్నా
చూడ్లేదని చేస్తూ ఉన్న ఒక నటన
చూడ్లేదని చేస్తూ ఉన్న ఒక నటన

ఎవరో ఎవరో నేనెవరో నువ్వే లేని నేనెవరో
నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా
ఓ చిరుగాలి వస్తావా
ప్రశ్నకు బదులే ఇస్తావా
కన్నుల నీటిని తుడిచేస్తావా నువ్వైనా
ఇది కలయా కలయా
మరి నిజమా నిజమా
ఇది కలయే అయితే ఇకమై కరిగిపోతుందే
ఇది నీడా నీడా
మరి వెలుగా వెలుగా
ఇది నీడే అయితే నిశిలో కలిసిపోతుంది



Credits
Writer(s): Harris Jayaraj, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link