Telugu Jaathi Manadi

తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది
తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ నాది రాయలసీమ నాది సర్కారు నాది నెల్లూరు నాది అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా
తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది
ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్నా
యాసలు వేరుగ ఉన్నా మన భాష తెలుగు భాషన్నా
వచ్చిండన్నా వచ్చాడన్నా ఆ వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా
తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది

మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో
భాగవతం వెలసింది ఏకశిలానగరంలో
ఈ రెంటిలోన ఏది కాదన్న
ఈ రెంటిలోన ఏది కాదన్న ఇన్నాళ్ళ సంస్కృతి నిండుసున్నా
తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది

పోచంపాడు ఎవరిది నాగార్జున సాగరమెవరిది
పోచంపాడు ఎవరిది నాగార్జున సాగరమెవరిది
మూడు కొండలు కలిపి దున్నినా ముక్కారు పంటలు బండ్లకెత్తినా
అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలం ఐదు కోట్ల తెలుగువారిది
తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది
సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము
స్వతంత్ర భారత్ కి జై
గాంధీ, నెహ్రూల పిలుపునందుకుని సత్యాగ్రహాలు చేసాము
వందేమాతరం వందేమాతరం
స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము
జై విశాలాంధ్ర
దేశభక్తిలో తెలుగువారికి దీటే లేదనిపించాము
తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది

ఇంటిలోన అరమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా
కంటిలో నలక తీయాలంటే కనుగుడ్డు పెరికి వేయాలా
పాలుపొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు
పాలుపొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు
నలుగురిలో మనజాతిపేరును నవ్వులపాలు చెయ్యెద్దు
తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ మనది రాయలసీమ మనది సర్కారు మనది నెల్లూరు మనది అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా
తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది

Credits
Writer(s): Dr. C Narayana Reddy, T. V. Raju
Lyrics powered by www.musixmatch.com

Link