Omkaram

ఓంకారం ఓంకారం
ఓంకారం సకలకళా శ్రీకారం
చతుర్వేద సాకారం
చైతన్య సుధాపూరం
జ్ఞానకమల కాసారం
ధ్యాన పరిమళాసారం
మధుర భక్తి సింధూరం
మహాభక్త మందారం
భవవేరి భాండారం
హృదయశంఖ హూంకారం
ధర్మ ధనుష్ఠంకారం
జగత్ విజయ ఝంకారం
అద్వైత ప్రాకారం భజేహం
అండాకారాండ పిండ భాస్వత్
బ్రహ్మాండ భాండ నాదలయత్
బ్రహ్మ్యాత్మక నవ్య జీవనాదారం
వర్ణ రహిత వర్గ మధిత
లలిత లలిత భావ లులిత భాగ్య
రజిత భోగ్య మహిత వసుధైక కుటీరం
కామితార్థం బందురం
కళ్యాణ కందరం
సద్గుణైక మందిరం
సకలలోక సుందరం
పుణ్య వర్ణ పుష్కరం
దురిత కర్మ దుష్కరం
శుభకరం సుధాకరం
సురుచిరం సుదీపరం
భవకరం భవాకరం
త్రిఅక్షరం అక్షరం భజేహం

మాధవ మాయా మయ బహు
కఠిన వికట కంటక పద సంసారం
కానన సుఖ ఙ్ఞాన శకట విహారం
అష్టాక్షరీ ప్రహృష్ట పంచాక్షరీ విశిష్ట
మహా మంత్ర యంత్ర తంత్ర
మహిమాలయ గోపురం
ఘనఘంభీరాంబరం
జంబూ భూభంబరం
నిర్మల యుగ నిర్గరం
నిరుపమాన నిర్జరం
మధుర భోగి కుంజరం
పరమ యోగి భంజరం
ఉత్తరం నిరుత్తరం మనుత్తరం
మహత్తరం మహాకరం మహాంకురం
తత్త్వమసితత్పరం తాథితరాత్త మోహరం
మృత్యోర్మమృతత్వకరం అజరం అమరం

మ కారం ఉ కారం అ కారం
ఓం కారం అద్వైత ప్రాకారం



Credits
Writer(s): Nag Sreevascha, Sri Vedavyas
Lyrics powered by www.musixmatch.com

Link