Adara Adara Adaragottu

జే జే జే జే జేజేలంది మా ఇంటి పెళ్లి కళ
దిల్ సే దిల్ ముడి వేసేయ్ మంది వారే వీరై పోయేలా
కలలే కలిపిన అనుబంధంగా
ఇలలో ఇపుడే సుముహూర్తంగా
ఎదురైయ్యింది చల్లని వేళ కల్యాణ లీలా

అదరదర గొట్టు డోలు బాజాల బీటు
ఊరు ఉయ్యాలుగేట్టు మోత మోగించే ట్రంఫెట్
అట్టాంటిట్టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మేట్టు
అరే అరే అదరదర గొట్టు ఇదివరకిలాంటి పెళ్లి లేనట్టూ
హే మగపెళ్లివారమంతా వాలిపోయాం విడిదింట
పనిలో పని పళ్ళకిని మోసుకొచ్చేశామంట
మనువాడే శ్రీ మహాలక్ష్మిని తీసుకెళ్తాం మావెంట
ఆలస్యం దేనికింక తాళిబొట్టు కట్టేస్తా
పప్పర పప్ప పారా రారా
పప్పర పప్ప పారా రారా
అత్తింటి కోడలిని వేలు పట్టి వచ్చేస్తా
పప్పర పప్ప పారా రారా

అదర అదర ఆదరదర గొట్టు డోలు బాజాల బీటు
ఊరు ఉయ్యాలుగేట్టు మోత మోగించే ట్రంఫెట్
అట్టాంటిట్టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మేట్టూ

హే పిల్లేమో ఎరుపు బంగారం కలగలుపు
పిల్లొడే కట్నం ఇచ్చుకోక తప్పదు
హే హే మావాడు మెరుపు పోటీలేని గెలుపు
స్విస్ బ్యాంకే రాసి ఇచ్చుకున్న చాలదు హే
వజ్రం లాంటి పిల్లను ఇస్తాం చాలనుకోండి మీరు
తన అదృష్టంతో కలిసొస్తాయి అన్ని లాంచనాలు
హే చూసేస్తున్నాడే వరుడు లాగ్గమెప్పుడన్నట్టు
ఆ మాటే అడిగిస్తుంది పిల్ల బుగ్గ లోగుట్టు
తాపీగా ఉన్నారండి తత్తర బిత్తర లేనట్టు
ఆలస్యం దేనికింక తాళిబొట్టు కట్టేస్తా

హే భూలోకమంతా వెతికి చూసుకున్నా
ఇట్టాంటి అమ్మడు మీకు దక్కదు
హే నీ కంటి పాప కోరి చేరుకున్న వీరాది వీరుడు
మా నిండు చంద్రుడు
హే అన్ని తానై ఉన్నాడు దేవుడులాంటి నాన్న
నే కోరే వరమే లేదంట తన సంతోషం కన్నా
ఆ అలాంటి రామచంద్రుడు నీలాగే ఉండుంటాడు
చిన్నారి జానకి సీతకు చెయ్యందించి పెళ్లాడు
నీ కన్నతండ్రి కంట్లో వెలిగే ఆనందం చూడు

ఆలస్యం దేనికింక తాళిబొట్టు కట్టేస్తా
పప్పర పప్ప పారా రారా
పప్పర పప్ప పారా రారా
అత్తింటి కోడలిని వేలు పట్టి వచ్చేస్తా
పప్పర పప్ప పారా రారా

అదర ఆదర ఆదరదరగొట్టు డోలు బాజాల బీటు
ఊరు ఉయ్యాలుగేట్టు మోత మోగించే ట్రంఫెట్
అట్టాంటిట్టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మేట్టూ

సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి,దూకుడు,ఎస్.ఎస్.థమన్క ర్తీక్, కోటి, రామజోగయ్య శాస్త్రి, శ్రీవర్ధిని, రానైనా రెడ్డి, మేఘా



Credits
Writer(s): Ramajogayya Sastry, S Thaman
Lyrics powered by www.musixmatch.com

Link