Aalayana Hara Thilo

ఆలయాన హారతిలో, ఆఖరి చితిమంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం

ఆలయాన హారతిలో, ఆఖరి చితిమంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం
దీపాన్ని చూపెడుతుందో, తాపాన బలిపెడుతుందో
అమృతమో హాలాహలమో ఏమో ప్రేమగుణం
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం
ఆలయాన హారతిలో, ఆఖరి చితిమంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం

ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా
గుండెబావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా
ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా
ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ ఇవ్వమ్మా
నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం
ఎదర ఉంది నడిరేయన్నది ఈ సంధ్యా సమయం
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం
ఆలయాన హారతిలో, ఆఖరి చితిమంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం

సూర్యబింబమే అస్తమించనిదె మేలుకోని కల కోసం
కళ్ళు మూసుకుని కలవరించెనే కంటిపాప పాపం
ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా
రేయి చాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా
పొందేది ఏదేమైనా, పోయింది తిరిగొచ్చేనా
కంటిపాప కల అడిగిందని నిదురించెను నయనం
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం
ఆలయాన హారతిలో, ఆఖరి చితిమంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం
దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో
అమృతమో హాలాహలమో ఏమో ప్రేమగుణం
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం



Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, S.a.raj Kumar
Lyrics powered by www.musixmatch.com

Link