Cheppamma Cheppamma

చెప్పమ్మా చెప్పమ్మా చిలకమ్మా
నీ అందమైన చిరునామా
ఇప్పుడే ఇక్కడే వాలిపోమ్మా
ఎద తలుపు తెరుచుకుందమ్మా
నీదే ఆలోచన ఎటువైపు చూపు వెళుతున్నా
ఓ కన్నె వనమా కవ్వించకమ్మా
నా మనసే నిలకడ లేక
నీ ఊహ వెనక మాటైనా వినక
తన ఉనికే బదులే లేక
చెప్పమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా చెప్పమ్మా చిలకమ్మా
నీ అందమైన చిరునామా

నీ రూపు రేఖల బొమ్మ
నా వలపులో దోచక
నా చూపు జాడలకైనా
ఆ ఛాయలే అందక
నీ స్నేహ గీతిక కోసం
వేచింది ఎద వేదిక
నీ చూపు సోకే దాకా
నిదురైన రాదే ఇక
గుండెలో గుప్పున
ఎన్నేనో చిగురాశలే
కళ్ళల్లో కమ్మని కలలే కదిలించెనే
చిలిపి వయసు వలపు కవిత చదివే
కన్నె వనమా కవ్వించకమ్మా
నా మనసే నిలకడ లేక
నీ ఊహ వెనక మాటైనా వినక
తన ఉనికే బదులే లేక
చెప్పమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా చెప్పమ్మా చిలకమ్మా
నీ అందమైన చిరునామా

నిను చూడగానే నాలో
ఏ భావం ఉప్పొంగునో
అనుకుంటే నాలో లోనే
ఒక వింతగా ఉన్నదే
ఏ తీరుగా నను నీతో
పరిచయం కలిగించునో
ఆ తీపి కలయిక నాలో
ఏ రాగం ఒలికించునో
ముద్దుగా అందితే
తియ్యని సంకేతమే
చేతికే అందదా
అందని ఆకాశమే
మనసు పడిన వరము దొరికిపోదా
కన్నె వనమా కవ్వించకమ్మా
నా మనసే నిలకడ లేక
నీ ఊహ వెనక మాటైనా వినక
తన ఉనికే బదులే లేక
చెప్పమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా చెప్పమ్మా చిలకమ్మా
నీ అందమైన చిరునామా
ఇప్పుడే ఇక్కడే వాలిపోమ్మా
ఎద తలుపు తెరుచుకుందమ్మా
నీదే ఆలోచన ఎటువైపు చూపు వెళుతున్నా
ఓ కన్నె వనమా కవ్వించకమ్మా
నా మనసే నిలకడ లేక
నీ ఊహ వెనక మాటైనా వినక
తన ఉనికే బదులే లేక
చెప్పమ్మా చెప్పమ్మా



Credits
Writer(s): Ghantaadi Krishna, Varikuppala Yadagiri
Lyrics powered by www.musixmatch.com

Link