Mynaa Emynave

మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక
నీకు తోడు నేనిక నీవు లేక లేనిక
సాగు అల్లిక కొనసాగనీ ఇక
పూల మాలిక చెలి పూజకే ఇక
మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం

విరహాల నిట్టూర్పు విరజాజి ఓదార్పు
చలి గాలి సాయంత్రాల స్వాగతమే
పైపైకొచ్చే తాపాలు పైటమ్మిచ్చే శాపాలు
ఎదతోనే ముందుగా చేసే కాపురమే
ఎవరేమైనా ఎదురేమైనా నేనేమైనా నీవేమైనా
ఈ తోవుల్లో పువ్వై నిను పూజిస్తూ ఉన్నా

మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
సందెపొద్దు నేరాలు అందమైన తీరాలు
దాటేస్తే కాదన్నానా ఎప్పుడైనా
కవ్విస్తున్న నీ కళ్ళు కైపెక్కించే పోకళ్లు
కాటేస్తే కాదంటానా ఇపుడైనా
వయసేమైనా సొగసేమైనా మైమరిపించే మనసేమైనా
నవ్వు నవరాత్రి నీకోసం తీసుకు వస్తున్నా

మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక
నీకు తోడు నేనిక నీవు లేక లేనిక
సాగు అల్లిక కొనసాగనీ ఇక
పూల మాలిక చెలి పూజకే ఇక
మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం



Credits
Writer(s): Veturi, S.a.raj Kumar
Lyrics powered by www.musixmatch.com

Link