Jiyyangari

(జగదానంద కారకా
జగదానంద కారకా
జయ జానకీ ప్రాణ నాయకా
జయ జానకీ ప్రాణ నాయకా
జగదానంద కారకా)

(గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర
సుగుణాకర సురసేవ్య భవ్య దాయక
సదా సకల, జగదానంద కారకా)

(సాసనిపాప ససరిసా సమమగా
సమమాప పమమపమమ రిరిసమారిసస
నిపాప మమప
సాస నినిసా నినిసా నినిసానిప
రిసానిప సానిపమమ నిపమరి పామరిస
పాప సాస నిపమరిస రిగమ
జగదానంద కారకా)

జియ్యంగారి ఇంటి సొగసా
జియ్యంగారి ఇంటి సొగసా
జియ్యంగారి ఇంటి సొగసా

నీ వంటి తరుణి పుడమిలో లేదే
ఇకపై పుడితే అది మన పాపే
నీ వంటి ఘనుడు జగతిలో లేడే
ఘనుడితో వలపు సులభం కాదే
అజ్ఞానంలో ఉండే ఆనందమిదే
వలపుల బడిలో బాలకుడే పండితుడే

జియ్యంగారి ఇంటి సొగసా
జియ్యంగారి ఇంటి సొగసా
జియ్యంగారి ఇంటి సొగసా

(సగమా నిపమగ గమప
పస సానిని నీపా పమా మామగు
సగమా నిపమగ గమప
పస సానిని నీపాప మపమగు)

మకరందం పొడి సిద్ధం చేసి
దాన్లో స్వర్ణగందం కొంచం కొంచం కలిపి
హరివిల్లు లోని వర్ణాలద్ది బ్రహ్మే మలిచాడో
శతకోటి పువ్వులుతెచ్చి జంటపూలుగ మలిచాడో
నీ పెదవుల్లోంచి పల్లవించు వేదం
మన పెదవుల్లోంచి ప్రభవించు జీవం
కౌగిట్లో నే ఇవ్వు ముద్దుకి అనుమతి ఒకపరి (ఇవ్వు ముద్దుకి అనుమతి ఒకపరి)

జియ్యంగారి ఇంటి సొగసా
జియ్యంగారి ఇంటి సొగసా
జియ్యంగారి ఇంటి సొగసా

(సానిప నిపమ పమగమ గసగమప)

నింగిని నేలపైకి దించి
చిరు నక్షత్రాల తోరణాలే అమర్చి
సిరి మల్లెపూల పందిరి కింద మాలని వేస్తావా
నీ ముద్దులతోనే నింగీ నేలను ఏకం చేస్తావా
మింటి వానలోస్తే పైరు పెరిగేను
జంట వానలొస్తే శృష్టి జరిగేను
జాలమేనోయ్ ప్రియా
సొగసులో తప్పులు జరగని (సొగసులో తప్పులు జరగని)

జియ్యంగారి ఇంటి సొగసా
జియ్యంగారి ఇంటి పురుషా
జియ్యంగారి ఇంటి సొగసా

నీ వంటి తరుణి పుడమిలో లేదే
ఇకపై పుడితే అది మన పాపే
నీ వంటి ఘనుడు జగతిలో లేడే
ఘనుడితో వలపు సులభం కాదే
అజ్ఞానంలో ఉండే ఆనందమిదే
వలపుల బడిలో బాలకుడే పండితుడే

జియ్యంగారి ఇంటి పురుషా
జియ్యంగారి ఇంటి సొగసా
జియ్యంగారి ఇంటి పురుషా, పురుషా



Credits
Writer(s): Chandrabose, Bhuvana Chandra, Harris Jayaraj
Lyrics powered by www.musixmatch.com

Link