Telugu Vari Pelli

తెలుగు వారి పెళ్లి
ఇల వైకుంఠమె మళ్లీ
సాంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి
ఇది తెలుగు వారి పెళ్లి

తెలుగు వారి పెళ్లి
ఇల వైకుంఠమె మళ్లీ
సాంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి
ఇది తెలుగు వారి పెళ్లి

ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం
ఆ నిర్ణయానికీ తలవంచడమే పెళ్ళి అంతరార్థం
శతమానం భవతి అంటుంది
శ్రావణమాసం
శ్రావణమాసం
శ్రావణమాసం

తెలుగు వారి పెళ్లి
ఇల వైకుంఠమె మళ్లీ
సాంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి
ఇది తెలుగు వారి పెళ్లి

మంగళకరమే బంగారం నిత్యము శక్తిమయం
అది మాంగలంగ్యా ముడి పడితే
తగించును స్త్రీ హృదయం
తాళిబొట్టులో రెండు పుస్తెలు లక్ష్మీ పార్వతులూ
అవి పుట్టినింటికీ మెట్టెనింటికీ పట్టిన హారతులూ
ఆ సంగతులన్నీ చెబుతుంది
శ్రావణమాసం
శ్రావణమాసం
శ్రావణమాసం
తెలుగు వారి పెళ్లి
ఇల వైకుంఠమె మళ్లీ
సాంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి
ఇది తెలుగు వారి పెళ్లి

నవగ్రహాలకు ప్రతిరూపాలే ఈ నవధాన్యాలూ
ఆ చంద్రుని ధాన్యం బియ్యమే కదా పెళ్ళి తలంబ్రాలు
మనువుకు మూలం మనసైతే
ఆ మనసుకు చంద్రుడు అధిపతి
ఈ అనుభంధంతో బియ్యం పొందెను అక్షింతలుగా ఆకృతి
ఆ వేడుకలన్నీ చూడాలందీ శ్రావణమాసం
శ్రావణమాసం
శ్రావణమాసం
తెలుగు వారి పెళ్లి
ఇల వైకుంఠమె మళ్లీ
సాంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి
ఇది తెలుగు వారి పెళ్లి

ఒకే కలపతో ఒకే పలకగా పెళ్ళి పీట ఉందీ
అదీ ఒకే ప్రాణమై దంపతులిద్దరు ఉండాలంటుందీ
చాలీ చాలని ఆ పీటా సన్నగా ఉంటుంది
అది సర్దుకు పోయే మనసుండాలని జంటకు చెబుతుంది
ఆ సందేశాలను అందిస్తుంది శ్రావణమాసం
శ్రావణమాసం
శ్రావణమాసం

తెలుగు వారి పెళ్లి
ఇల వైకుంఠమె మళ్లీ
సాంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి
ఇది తెలుగు వారి పెళ్లి



Credits
Writer(s): V Srinivas, Vengila Rambabu
Lyrics powered by www.musixmatch.com

Link