Aakasam

ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే
భూలోకం నన్ను నిద్దరపుచ్చాలి
జాబిల్లి తన వెన్నెలతో నను నిద్దుర లేపి
రేయంతా తెగ అల్లరి చెయ్యాలి
ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి
అవి రేపో మాపో నిజమవ్వాలి
గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి
అవి లోకంలోన చీకటినంతా తరిమెయ్యాలి

ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే
భూలోకం నన్ను నిద్దరపుచ్చాలి
జాబిల్లి తన వెన్నెలతో నను నిద్దుర లేపి
రేయంతా తెగ అల్లరి చెయ్యాలి

ఆరారో అని ఈ గాలి నాకే జోలలు పాడాలి
ఏలేలో అని గోదారి నాతో ఊసులు ఆడాలి
ఇంద్రధనస్సుని ఊయలగా నేను మలచాలి
తారలన్ని నాకు హారము కావాలి
మబ్బునుండి జారు జల్లులలో నేను తడవాలి
చందమామ నాకు చందనమవ్వాలి
రంగులతో కళ్లాపే చల్లాలి
ఆ రంగులనుండి లాలించే ఒక రాగం పుట్టాలి

ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే
భూలోకం నన్ను నిద్దరపుచ్చాలి

నావాడు ఎక్కడున్నా సరే
రారాజల్లే నను చేరుకోవాలి
నాతోడుంటూ ఎన్నడైనా సరే
పసిపాపల్లే నను చూసుకోవాలి
అమ్మలోన ఉన్న కమ్మదనం వెన్నలోన కలిపి
నాకు ముద్దు ముద్దు గోరుముద్దలు పెట్టాలి
ప్రేమలోన ఉన్న తియ్యదనం ప్రేమతోటి తెలిపి
చిన్నతప్పు చేస్తే నన్ను తియ్యగ తిట్టాలి
ఏనాడూ నా నీడై ఉండాలి
ఆ నీడను చూసి ఓటమిలన్నీ పారిపోవాలి

ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే
భూలోకం నన్ను నిద్దరపుచ్చాలి
జాబిల్లి తన వెన్నెలతో నను నిద్దుర లేపి
రేయంతా తెగ అల్లరి చెయ్యాలి



Credits
Writer(s): Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link