Kita Kita Talupulu

కిటకిట తలుపులు తెరిచిన
కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతూ అలిసిన
మనసుకు చంద్రోదయం
రెండూ కలిసి ఒకసారే
ఎదురయ్యే వరమా
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

కిటకిట తలుపులు తెరిచిన
కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతూ అలిసిన
మనసుకు చంద్రోదయం

నిన్నిలా చేరేదాకా ఎన్నడూ నిదరే రాక
కమ్మని కలలో అయినా
నిను చూడలేదే
నువ్విలా కనిపించాక జన్మలో
ఎపుడూ ఇంక
రెప్పపాటైనా లేక చూడాలనుందే
నా కోసమా అన్వేషణ
నీడల్లె వెంట ఉండగా
కాసేపిలా కవ్వించనా నీ మధుర
స్వప్నమై ఇలా
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

కిటకిట తలుపులు తెరిచిన
కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతూ అలిసిన
మనసుకు చంద్రోదయం

కంట తడి నాడు నేడు
చెంప తడిమిందే చూడు
చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా
చేదు ఎడబాటే తీరు
తీపి చిరునవ్వే చేరి
అమృతం అయిపోలేదా ఆవేదనంతా
ఇన్నాళ్ళుగా నీ జ్ఞాపకం నడిపింది
నన్ను జంటగా
ఈనాడిలా నా పరిచయం
అడిగింది కాస్త కొంటెగా
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

కిటకిట తలుపులు తెరిచిన
కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతూ అలిసిన
మనసుకు చంద్రోదయం
రెండూ కలిసి ఒకసారే
ఎదురయ్యే వరమా

ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ



Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, R.p. Patnaik
Lyrics powered by www.musixmatch.com

Link