Sirula Nosage

సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ
సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ
పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ
పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ

సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ

షిరిడి గ్రామములో ఒక బాలుని రూపములో
వేపచెట్టు కింద వేదాంతిగా కనిపించాడు
తన వెలుగును ప్రసరించాడు
పగలు రేయి ధ్యానం
పరమాత్మునిలో లీనం
పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం
ఆనందమే ఆహారం చేదు చెట్టు నీడయే గురు పీఠం

ఎండకు వానకు కృంగకు ఈ చెట్టు క్రిందనే ఉండకు
సాయి
సాయి రా మసీదుకు అని మహల్సాపతి పిలుపుకు
మసీదుకు మారెను సాయి
అదే అయినది ద్వారకామయి
అక్కడ అందరూ భాయి భాయి
బాబా భోదల నిలయమదోయి

(సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ)

ఖురాను బైబులు గీత ఒకటని కులమత భేదము వద్దనే
గాలివాన నొక క్షణమున ఆపే
ఉడికే అన్నము చేతితో కలిపే
రాతి గుండెలను గుడులను చేసె
నీటి దీపములను వెలిగించె

పచ్చి కుండలో నీటిని తెచ్చి పూలమొక్కలకు పోసి
నిండే వనమును పెంచి మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించె

కప్పకు పాముకు స్నేహం కలిపే తల్లి భాషకు అర్దం తెలిపె

ఆర్తుల రోగాలను హరియించే
భక్తుల బాదలు తాను భరించే
ప్రేమ సహనం రెండు వైపులా ఉన్ననాడే గురుదక్షిణ అడిగే
మరణం జీవికి మార్పును తెలిపే
మరణించి తను మరలా బ్రతికె

(సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం)

నీదని నాదని అనుకోవద్దనె
ధునిలో ఊది విభూదిగనిచ్చె
భక్తి వెల్లువలు జయ జయ ఘోషలు చావడి ఉత్సవమై సాగగా

కంకడ హారతులందుకొని కలిపాపాలను కడుగగా
సకల దేవతా స్వరూపుడై వేదశాస్త్రములకతీతుడై
సద్గురువై జగద్గురువై
సత్యం చాటే దత్తాత్రేయుడై భక్తుని ప్రాణం రక్షించుటకై
జీవన సహచరి అని చాటిన తన ఇటుక రాయి తృటిలో పగులగా
పరిపూర్ణుడై గురుపౌర్ణమై
భక్తుల మనసులో చిరంజీవియై శరీర సేవాలంగన చేసి
దేహము విడిచెను సాయి
సమాధి అయ్యెను సాయి

(సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం)

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా
శ్రీ సమర్ద సద్గురు సాయినాధ మహరాజ్



Credits
Writer(s): Vandemataram Srinivas, Jonnavitthula
Lyrics powered by www.musixmatch.com

Link