Nallani Bangaaram

రేలారే రేలారే

(జుంబకు జుంబకు జుంబకు బొలో)
(జుంబకు జుంబకు జుం హ)
(జుంబకు జుంబకు జుంబకు బొలో)
(జుంబకు జుంబకు జుం హ)
నల్లని బంగారం రా
నా తల్లి సింగరేఱి రా
గోదావరి తీరమంత నేల
పురిటి పంటరా
పైకి చూడ రాకాసి బొగ్గు (ఓ)
లోన జూడ వజ్రాలే ఉండు (ఆఆ)
పైకి చూడ రాకాసి బొగ్గు (ఓ)
లోన జూడ వజ్రాలే ఉండు (ఆఆ)
ఊరు బిడ్డలకు కూడు పెడతది
నీడ లేనోల్లకి నీడనిస్తది

(రేల రేల రేల రేల రేల రేలా రే)
(రేల రేల రేల రేల రేల రేలా రే)

సింగరేఱికి దండాలో
మా సిరుల తల్లికీ దండాలో
(సింగరేఱికి దండాలో)
(మా సిరుల తల్లికీ దండాలో)
భూమీలో బొగ్గున్నాల్లు
బువ్వాకు కొదువే లేదు
సంపదనెలికీ తీసి సక్కంగ బతుకుతాము

సింగరేఱికి దండాలో
మా సిరుల తల్లికీ దండాలో
ఘీకారణ్యం భీకారణ్యం
ఉరుముల మెరుపుల ఉప్పెన జూడు
(ఉరుముల మెరుపుల ఉప్పెన జూడు)
గోదారమ్మ జోలపాడగ
నేల పొరల్లో నిప్పులు జూడు
(నేల పొరల్లో నిప్పులు జూడు)
తల్లి కడుపు పిండం జూడు (ఓ)
భూమి తల్లి బిడ్డని జూడు (ఆఆ)
తల్లి కడుపు పిండం జూడు (ఓ)
భూమి తల్లి బిడ్డని జూడు (ఆఆ)
మల్లవతారం ఎత్తిదమ్మా
తల్లి దేవత నల్ల బంగారం

(రేల రేల రేల రేల రేల రేలా రే)
(రేల రేల రేల రేల రేల రేలా రే)

సింగరేఱికి దండాలో
మా సిరుల తల్లికీ దండాలో
చీకట్లను రూపుమాపేటి
రామగుండము కరెంటు జూడు
(రామగుండము కరెంటు జూడు)
మంచిర్యాలలో సిమెంటు గన్నది
కాగజ్నగరులో కాగితమైనది
(కాగజ్నగరులో కాగితమైనది)
సింగరేఱి తల్లి కడుపులో (ఓ)
పుట్టినాయి చిత్రాలు ఎన్నో (ఆఆ)
సింగరేఱి తల్లి కడుపులో (ఓ)
పుట్టినాయి చిత్రాలు ఎన్నో (ఆఆ)
అన్నమో రామని అరిచే జీవికి
అన్నం బెట్టిన అన్నదాతరా

(రేల రేల రేల రేల రేల రేలా రే)
(రేల రేల రేల రేల రేల రేలా రే)

సింగరేఱికి దండాలో
మా సిరుల తల్లికీ దండాలో
కొలువు కోసము పల్లెలనిడిసి
పట్నం జేరిన జీవుల జూడు
(పట్నం జేరిన జీవుల జూడు)
కులమును ఇడిచి మతమును ఇడిచి
కూడి బతికేటి తీరును జూడు
(కూడి బతికేటి తీరును జూడు)
అల్లి మల్లి తీగల జూడు (ఓ)
అన్న దమ్ములాటలు జూడు (ఆఆ)
అల్లి మల్లి తీగల జూడు (ఓ)
అన్న దమ్ములాటలు జూడు (ఆఆ)
కడుపున పెంచిన కన్న తల్లికన్నా
మిన్నగ పెంచిన అమ్మను జూడు

(రేల రేల రేల రేల రేల రేలా రే)
(రేల రేల రేల రేల రేల రేలా రే)

సింగరేఱికి దండాలో
మా సిరుల తల్లికీ దండాలో
(సింగరేఱికి దండాలో)
(మా సిరుల తల్లికీ దండాలో)



Credits
Writer(s): Shaik Imam, Bhanuri Satyanarayana
Lyrics powered by www.musixmatch.com

Link