Kanapadaleda

కనపడలేదా గోదారి తల్లి కడుపుకోత
వినబడలేదా గోదారి నీళ్ళ రక్తఘోష
(కనపడలేదా గోదారి తల్లి కడుపుకోత)
(వినబడలేదా గోదారి నీళ్ళ రక్తఘోష)
గుండె నిండా పాలున్న బిడ్డలకందించలేని తల్లి బ్రతుకు దేనికని
బీళ్ళు నింపె నీళ్ళున్నా సముద్రాన పడిపోయే శాపం తనకెందుకనీ
బరువై దయకరువై తనువెలియై ఇక బలియై
(బరువై దయకరువై తనువెలియై ఇక బలియై)
ఉప్పుసాగరాలలోకి వెళ్ళలేక వెళ్ళలేక
వెక్కివెక్కి పడుతున్నది వృధాగ కనుమూయలేక
(వెక్కివెక్కి పడుతున్నది వృధాగ కనుమూయలేక)
ఆ అలల అలజడి ఓఓ
ఆ తడి ఆరని కంటితడి ఓఓ
ఆ అలల అలజడి, తడి ఆరని కంటితడి
కనబడలేదా వినబడటంలేదా

కనపడలేదా గోదారి తల్లి కడుపుకోత
వినబడలేదా గోదారి నీళ్ళ రక్తఘోష

శిలా పలక లేసి మీరు ఎలా మరచిపోయారని
బాసరలో సరస్వతి పీఠమెక్కి అడిగినది
ధుర్మదాంధులారా తెలుగు బిడ్డలకీ కర్మేందని
ధర్మపురిలో నారసింహ నాదం చేస్తున్నది

ఎడారులుగ మారుతున్న పొలాలను చూడలేక
కాళేశ్వర శివలింగం కాళ్ళు కడిగి ఏడ్చినది

బతుకు మోయలేని రైతు ఆత్మహత్యలను చలించి
భద్రాచల రాముడికి సాగిలపడి మొక్కినది

పాపి కొండల గుండె ధారై ప్రవహించినది
ధవళేశ్వర కాటన్ మహాశైలి తలచినది
సిగ్గుపడండని కుటిల నాయకులని తిట్టినది
గుండె పగిలి నరసాపూర్ సముద్రాన దూకినది

కనపడలేదా గోదారి తల్లి కడుపుకోత
వినబడలేదా గోదారి నీళ్ళ రక్తఘోష



Credits
Writer(s): Devi Sri Prasad, Suddala Ashok Teja
Lyrics powered by www.musixmatch.com

Link