Avunu Nijam

అవును నిజం
నువ్వంటే నాకిష్టం
ఈ నిమిషం, గుర్తించా ఆ సత్యం
చలి పరద ఇక నిలవదుగా
తెలుసు కదా ఆ...
తెలిసిందే అడగాలా
అడగందే అనవేళా
చెవిలో ఇలా... చెపితే చాలా
అవును నిజం
నువ్వంటే నాకిష్టం
ఈ నిమిషం, గుర్తించా ఆ సత్యం

కసిరేస్తున్నా మనసుకు వినపడదు ఏమో
విసిరేస్తున్నా నిను విడి వెనుకకు రాదేమో
నిదరోతున్నా ఎదురై కనపడుతావేమో
కదలాలన్నా కుదరని మెలిపెడతావేమో
అంతగా... కంట చూడనని మొండికేస్తే తప్పేమో
ఒంటిగా... ఉండనీయనని ముందుకొస్తే ముప్పేమో
మన సలహా మది వినదు కదా
తెలుసు కదా ఆ...
తెలిసే ఇలా... చెలరేగాలా
అవును నిజం
నువ్వంటే నాకిష్టం
ఈ నిమిషం, గుర్తించా ఆ సత్యం

సుడిగాలిలో తెలియని పరుగులు తీస్తున్నా
జడపూలతో చెలిమికి సమయము దొరికేనా
ఎదరేముందో తమరిని వివరములు అడిగానా
ఎద ఏమందో వినమని తరుముకురాలేనా
తప్పుకో కళ్ళు మూసుకుని తుళ్ళి రాకే నావెంటా
ఒప్పుకో నిన్ను నమ్ముకొని అల్లుకుంటా నా జంటా
నడపదుగా నిను నది వరద
తెలుసుకదా ఆ...
తెలిసే ఇలా... ముంచేయాలా
అవును నిజం
నువ్వంటే నాకిష్టం
ఈ నిమిషం, గుర్తించా ఆ సత్యం
చలి పరద ఇక నిలవదుగా
తెలుసు కదా ఆ...
తెలిసిందే అడగాలా
అడగందే అనవేళా
చెవిలో ఇలా... చెపితే చాలా



Credits
Writer(s): Mani Sharma, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link