Palle Kanneru Pedutundo

పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల
నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల
నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల

పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల
నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల

కుమ్మరి వామిలో తుమ్మలు మొలిసెను
కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను
పెద్దబాడిస మొద్దు బారినది
సాలెల మగ్గం సడుగులిరిగినవి
చేతివృత్తుల చేతులిరిగిపాయే నా పల్లెల్లోన
అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోనబాయే ఈ దేశం లోన

మడుగులన్ని అడుగంటి పోయినవి
బావులు సావుకు దగ్గరయ్యినవి
వాగులు వంకలు ఎండిపోయినవి
సాకలి పొయ్యిలు కూలిపోయినవి
పెద్దబోరు పొద్దంతా నడుస్తుందో బలిసీన దొరలది
మరి పేద రైతుల బావులెందుకెండే నా పల్లెల్లోన

ఈదులన్ని వట్టి మొద్దులయ్యినవి
ఈతకల్లు బంగారమయ్యినది
మందు కలిపిన కల్లును తాగిన మంది కండ్లనెండూసులయ్యినవి
చల్లని beer-u, whiskey లెవడు పంపే నా పల్లెల్లోకి
అరె బుస్సున పొంగె Pepsi, Cola వచ్చె నా పల్లెల్లోకి

పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల
నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల

పరకసాపలకు గాలాలేసే తురకల పోరలు యాడికి పోయిరి
లారీలల్ల క్లీనర్లయ్యిరా, petrol మురికిల మురికయ్యిండ్రా
తల్లీ దూదు సేమియాకు దూరమయ్యినారా సాయిబుల పోరలు
ఆ bakery cafe-u లో ఆకలితీరిందా ఆ పట్టణాలలో

అరకల పనికి ఆకలిదీరక గడమునొగల పనికాసమెల్లక
Furniture పనులెతుక్కుంటూ ఆ పట్నంపోయిర విశ్వ కర్మలు
ఆసామూలంతా కూసూనేటీ వడ్రంగుల వాకిలి
నేడు పొక్కిలి లేసి దుఃఖిస్తున్నదిరో నా పల్లెల్లోన

మేరోళ్ళ సేతులకత్తెర మూలపొయ్యి సిలువెక్కిపోయినది
చుట్టుడురెట్టల బనీన్లు బోయినవి, చోడేలాగులు జాడకేలేవు
రెడిమెడు fashion దుస్తులొచ్చెనంటా నా పల్లె పొలిమేరకు
ఆ కుట్టు మిషన్ల సప్పుడాగినాదా నా పల్లెల్లోన

పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల
నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల

నారా కెంపుతెల్లలు జెల్లలు పరులకు తెలియని మరుగు భాషతో
బేరం జేసే కంసలి వీధులు వన్నె తగ్గినవి, చిన్నబోయినవి
చెన్నై, బాంబే company నగలొచ్చి మనస్వర్ణ కారుల
అరె సెర్నకోలలై తరుముతున్నయీరా నా పల్లెల నుండి

మాదిగ లొద్ది నోరు తెరసినది, తంగెడు చెక్క భంగపడ్డది
తొండము బొక్కెన నిండమునిగినది, ఆరె రంపె పదునారిపోయినది
పాత రేకు వలె మోతలు మోగేటి ప్లాస్టిక్కు డప్పులు
నా మేదరి డప్పును పాతరేసె కదరా? నా పల్లెల్లోన

కుంకుమ దాసన బుక్క మీదగూడ company రక్కసి కన్నుబడ్డది
పూసలోళ్ళ తాళాము కప్పలు, కాశీల కలసి ఖతమైతున్నవి
బొట్టు బిళ్ళలు నొసటికొచ్చెగదరా నా పల్లెల గూట
మన గుడ్డి దాసరీ బతుకులాగమాయే ఈ పల్లెల్లోన

పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల
నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల

ఇల్లు కట్టుకొనె ఇటుకకు రాయితో, సెలకల చల్లె ఎరువుకుళ్లుతో
ఎద్దు బండి ఉన్నోనికి సేతిలో ఏడాదంతా పని దొరికేది
Tata Tractor-u టక్కరిచ్చినాదో నా డొంక దారిని
మా ఎద్దు బండి గిల్లెగిరిపడ్డదమ్మో నా పల్లెల్లోన

తొలకరి జల్లుకు తడిసిన నేల మట్టి పరిమళాలేమైపోయెరా
వానపాములు, నత్త గుల్లలు భూమిలో ఎందుకు బతుకతలేవు
పత్తిమందుల గత్తర వాసనరా ఈ పంట పొలాలల
ఆ మిత్తికి దెచ్చిన అప్పే కత్తాయే నా రైతు కుతికపై

హరిశ్చంద్ర పద్య నాటకాల పద్దు Harmonium చెదలు పట్టినది
యక్షగానము నేర్పే పంతులు ఉప్పరి పనిలో తట్టపట్టినడు
యాచకులు, నా బుడగా జంగాలూ ఈ పల్లెలనిడిచి
దేవా హరిహరా ఓ
యాచకులు, నా బుడగా జంగాలూ ఈ పల్లెలనిడిచి
ఆ పాతబట్టల మూటలమ్ముతుండ్రా తమ పొట్టకూటికై

పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల
నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల

పిండోలెన్నల రాలుచుండగా రచ్చబండపై కూసొని ఊరే
ఎనకటి సుద్దులు ఎదలూ కతలూ యాదిజేసుకొని బాధలె మరిచిరి
బుక్కనోటిలో పడ్డదంటే నేడు మన పల్లెల్లోన
అయ్యో ఒక్కడు రాతిరి బయిటకెళ్ళడమ్మో ఇది ఏమి సిత్రమో

బతుకమ్మా కోలాటపాటలు భజన కీర్తనలమద్దెల మోతలు
బైరాగుల కిన్నెర తత్వమ్ములు కనుమరుగాయెర నా పల్లెల్లో
అరె Star T.V సకిలిస్తా ఉన్నదమ్మో నా పల్లెల్లోన
సామ్రాజ్యవాద విషమెక్కుతున్నదమ్మో మెల్లంగా పల్లెకు

వృత్తులు కూలె, ఉపాధి పోయె, ప్రత్యామ్నాయం లేకనె పోయె
కూలిన బ్రతుకులు నిలుపుటకైనా కుటీర పరిశ్రమలైనా పెట్టరు
అరె బహుళ జాతి companyల మాయల్లోన మా అన్నల్లారా
భారత పల్లెలు నలిగి పోయి కుమిలే ఓ అయ్యల్లారా

పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల
నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల
నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల

Credits
Writer(s): Vandemataram Srinivas, Goranti Venkanna
Lyrics powered by www.musixmatch.com

Link