Neeve Amaraswarame

నీవే అమరస్వరమే, సాగే శృతిని నేనే
నీ మనసూ నీ మమతా వెలిసేనే నా కోసం
నీలో సర్వం నా సొంతం

నీవే అమరస్వరమే, సాగే శృతిని నేనే

పలికే నీ అధరాలు చిలికేనే మధురాలు
నింగి వీడి నేల జారిన జాబిలి
మురిసే నీలో అందం కురిసే ఊహల గంధం
మల్లె పూల బంధమీవు ఓ'చెలి

అంతులేనిది ఈ కథ అందరాని సంపద
రాగ బంధనం అనురాగ చందనం
అంతులేనిది ఈ కథ అందరాని సంపద
రాగ బంధనం అనురాగ చందనం

నా ధ్యాసలు నీవే నీ బాసలు నేనే
నా ఊహలు నీవే నీ ఊపిరి నేనే
నీలో సర్వం నా సొంతం

నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే

మెరిసే వన్నెల లోకం చిందే చల్లని గానం
తీయనైన ఆశలన్ని నీ వరం
తరగని చెరగని కావ్యం ఊహలకిది అనుబంధం
భావ రాగ భాష్యమే ఈ జీవితం

పలకరించు చూపులు పాట పాడు నవ్వులు
కొత్త పల్లవి కొసరీ ఆలపించెనె
పలకరించు చూపులు పాట పాడు నవ్వులు
కొత్త పల్లవి కొసరీ ఆలపించెనె

నూరేళ్ళు నీతో సాగాలి నేనే
నీ గుండెల్లోన నిండాలి నేనే
నీలో సర్వం నా సొంతం

నీవే అమరస్వరమే
సాగే శృతిని నేనే

నీ మనసూ నీ మమతా
వెలిసేనే నీ కోసం
నీలో సర్వం నా సొంతం
నీవే అమరస్వరమే
సాగే శృతిని నేనే



Credits
Writer(s): Ilayaraja, Rajaram Shinde Rajashree
Lyrics powered by www.musixmatch.com

Link