Okka Sari

నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు
తాను పలికితే చాలు తేనె జలపాతాలు
ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది
ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది
ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది
చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది
పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా తన కురులు చూపిస్తా ఔననక చస్తారా
ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది
ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది

గుండెల్లో భోగిమంటలా ఎండల్లో లేత వెన్నెల
కొండల్లో ఏటిపరుగులా ఊపుతున్న లయలో
గుమ్మంలో సంధ్యవెలుగులా కొమ్మల్లో కొత్త చిగురులా
మబ్బుల్లో వెండిమెరుపులా ఆమెకెన్ని హొయలో
అలా నడిచి వస్తుంటే పువ్వులవనం శిలై పోని మనిషుంటే మనిషే అనం
ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది
ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది

గాలుల్లో ఆమె పరిమళం ఊపిరిలో నిండి ప్రతి క్షణం
ఎటు ఉన్నా నన్ను వదలదే ఎలా తప్పుకోను
గుర్తొస్తే ఆమె పరిచయం కవ్వించే పడుచు పసిదనం
రెప్పల్లో కైపు కలవరం ఎలా దాచుకోను
కలో కాదో నాకే నిజం తేలక ఎలా చెప్పడం తాను నాకెవ్వరో
అదిరిపడకయ్యా ఇది ఆమె మాయ ఇది కవిత కాదబ్బా మన్మధుడి దెబ్బ

ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది
ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది
ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది
చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది
పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా తన కురులు చూపిస్తా ఔననక చస్తారా

Credits
Writer(s): Mani Sharma, Kandi Konda
Lyrics powered by www.musixmatch.com

Link