Nee Sneham

నీ స్నేహం దూరం ఆయే
నీ ప్రాణం భారం ఆయే
నీ నీడే రాదే నీ వెంట...
ఇన్నాళ్లు నీతో ఉంటూ
కన్నీళ్లే రానీకంటూ
చెప్పేటి వారే లేరింకా
పగలనియ్యకు గుండెలనీ
చెలిమి లేదు అనీ
ఎవరి దారులు వారివనీ
ముగిసె నీ మజిలీ
ఋణము తీరిన బంధం నిన్నే వదిలి పోయిందీ
మనసు ఒంటరినయ్యానంటూ కుమిలిపోతుందీ
నీ ఆశే నీరయ్యింది
నీ శ్వాసే నిప్పయింది
నీకంటూ ఇంకా ఏముందీ
ఈ దూరం భారం అంది
ఈ గాయం పోనంటుంది
నువ్వింకా చేసేదేముందీ



Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, R.p. Patnaik
Lyrics powered by www.musixmatch.com

Link