Anandam Anandam

M: ఏరల్లే ఉరికింది నీరల్లే తడిపింది
పూవల్లే విరిసింది తానే తానే
ఆనందం ఆనందం ఏదో ఆనందమే
తారల్లే మెరిసింది నా మనసే మురిసింది
గుట్టంతా విప్పింది తానే తానే
ఆనందం ఆనందం ఏదో ఆనందమే
అనుమానం కనుమరుగై తనువంతా కలవరమై లోకన్నే మరచానురా
తెరలన్నీ తీసింది దూరాన్ని చెరిపింది ననుకోరి వచ్చిందిలా
అనుమానం కనుమరుగై తనువంతా కలవరమై లోకన్నే మరచానురా
తెరలన్నీ తీసింది దూరాన్ని చెరిపింది ననుకోరి వచ్చిందిలా
ఆ ఆ... ఎరల్లే ఉరికింది నీరల్లే తడిపింది
పూవల్లే విరిసింది తానే తానే
ఆనందం ఆనందం ఏదో ఆనందమే
తారల్లే మెరిసింది నా మనసే మురిసింది
గుట్టంతా విప్పింది తానే తానే
ఆనందం ఆనందం ఏదో ఆనందమే
F: ఇన్నాళ్లు కన్నా నాముందు ఉన్నా నువ్వేనా
చూపుల్లో స్నేహం చేతల్లో ఇపుడే చూసానా
వెనువెంటే ఉంటూ ఓకంటకంటూ ఎంతైనా
నీ మనసే భరణం అది ఎంతో మధురం
M: ఇచ్చేనా
వేణువులా మారింది వెదురే
రాగాలే పలికింది అదిరే
కలలన్నీ చెల్లాచెదురే
నాకింక లేదంట నిదురే
తెరలన్నీ తీసింది దూరాన్నే చెరిపింది ననుకోరి వచ్చిందిలా
అనుమానం కనుమరుగై తనువంతా కలవరమై లోకన్నే మరచానురా.
F: పెదవంచు నుండి ఓ చిన్న నవ్వే జారిందే
నా ముందు ఉన్న నీ ఓర చూపే చేరిందే
ఆ చందమామే నా ముందుకొచ్చీ వాలిందే
నిన్నే చూసి అద్దం అంటూ మురిసిందే
M: వెన్నెల్లో నీ నవ్వే అందం
నువ్వున్న నా మనసే దుర్గం
నా చెంత వాలింది స్వర్గం
నాకంటు నువ్వేలే సొంతం
తెరలన్నీ తీసింది దూరాన్నే చెరిపింది ననుకోరి వచ్చిందిలా
అనుమానం కనుమరుగై తనువంతా కలవరమై లోకన్నే మరచానురా
ఏరల్లే ఉరికింది నీరల్లే తడిపింది
పూవల్లే విరిసింది తానే తానే
ఆనందం ఆనందం ఎదో ఆనందమే
తారల్లే మెరిసింది నా మనసే మురిసింది
గుట్టంతా విప్పింది తానే తానే
ఆనందం ఆనందం ఏదో ఆనందమే



Credits
Writer(s): M.radha
Lyrics powered by www.musixmatch.com

Link