Ku Ku Ku

కుకు కుకు కుకు కుకు
కుకుకుకుకుకుకూ ఎద కోయిల పాడేనా
కుకుకుకుకుకుకూ మధుమాసం నేడేనా
నమ్మలేని ఈ క్షణాన నేను నేనేనా
కమ్మనైన ఈ స్వరాన లీనమైపోనా
కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకు కు
కుకుకుకుకుకుకూ ఎద కోయిల పాడేనా
కుకుకుకుకుకుకూ మధుమాసం నేడేనా

ఎన్ని రంగులో నిన్నమొన్న చూడలేదు కమ్ముకొచ్చే ఇంతలో ఇలా
ఎన్ని ఉహలో ఉన్నచోట ఉండనీవు గాలి చిందులెంతసేపిలా
కొంటె ఊసులు, కొత్త ఆశలు అల్లుకుంటే అన్ని వైపులా
గుప్పెడంత ఈ చిన్ని గుండెలో గుట్టునింక ఆపడం ఎలా
కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకు కు
కుకుకుకుకుకుకూ ఎద కోయిల పాడేనా

కుకుకుకుకుకుకూ మధుమాసం నేడేనా

ఇన్నిరోజులు ఉన్నమాట చెప్పలేదు చిన్నదాని సన్నజాజులు
నన్ను ఎప్పుడూ రెప్పలెత్తి చూడలేదు కన్నెపిల్ల కంటి చూపులు
సైగ చేయడం నేర్చుకున్నవి ముచ్చటైన లేత నవ్వులు
కొమ్మ చాటుగా దాగనన్నవి విచ్చుకున్న సిగ్గు పువ్వులు
కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకు కు
కుకుకుకుకుకుకూ ఎద కోయిల పాడేనా
కుకుకుకుకుకుకూ మధుమాసం నేడేనా
నమ్మలేని ఈ క్షణాన నేను నేనేనా
కమ్మనైన ఈ స్వరాన లీనమైపోనా
కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకు కు



Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, R.p. Patnaik
Lyrics powered by www.musixmatch.com

Link