Ennenno Andaalu

ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు
వేసే పూల బాణం కూసే గాలి గంధం
పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం
ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు

సిరిగల చిలకలు ఇలదిగి నడచుట న్యాయమా ధర్మమా
తొలకరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగునా
చలిమర గదులలో సుఖపడు బతుకులు వేసవే కోరునా
అలికిన గుడిసెల చలువుల మనసులు మేడలో దొరుకునా
అందాల మేడల్లోనే అంటదు కాలికి మన్ను
బంగారు పంటలు పండే మన్నుకు చాలదు మిన్ను
నిరుపేదిల్లు పొదరిల్లు
ఇలలో ఉన్న హరివిల్లు

ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు
వేసే పూల బాణం కూసే గాలి గంధం
పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం
ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు

జలజల పదముల అలజడి నదులకు వంత నే పాడనా
మిలమిల మెరిసిన తళతళ తారలు నింగినే వీడునా
చెరువుల కడుపున విరిసిన తామర తేనెలే పూయునా
మిణుగురు పురుగుల మిడిమిడి వెలుగులు వెన్నెలై కాయునా
ఏ గాలి మేడల్లోనో దీపంలా నే ఉన్నా
మా పల్లె సింగారాలు నీలో నేనే కన్నా
గోదారమ్మ పరవళ్ళు
తెలుగింటమ్మ తిరునాళ్ళు

ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు
వేసే పూల బాణం కూసే గాలి గంధం
పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం
ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు

సాహిత్యం: వేటూరి, చంటి, ఇళయరాజా



Credits
Writer(s): Veturi Murthy, Ilayaraja I
Lyrics powered by www.musixmatch.com

Link