Mamuganna Maayamma

మేతకెళ్లిన ఆలమందకెదురు చూస్తూ
గుంజకున్న లేగ అంబా అని అరుచు
బుజ్జి మేక పిల్లల అల్లరి అరుపులతో
మాటిమాటికీ మెహ్ మెహ్ అని పాట పాడు
భాష రాని మూగ జీవి ఘోషలో కూడా
అమ్మా అనే కమ్మని పిలుపు ఉంది
అమ్మయే సృష్టికి ఆదిమూలము రా

మముగన్న మాయమ్మ మా తల్లి లచ్చమ్మ
జన్మంతా మొక్కినా నీ ఋణం తీర్చలేమమ్మా
జన్మంతా మొక్కినా నీ ఋణం తీర్చలేమమ్మా
అమ్మా... అమ్మా... అమ్మా ఓ మాయమ్మ
మముగన్న మాయమ్మ మా తల్లి లచ్చమ్మ
జన్మంతా మొక్కినా నీ ఋణం తీర్చలేమమ్మా
జన్మంతా మొక్కినా నీ ఋణం తీర్చలేమమ్మా

గర్భాన మము మోసి మా జన్మ కోసం
పునర్జన్మ ఎత్తిన మా కన్న తల్లి
కడుపులోన ఉండి కాళ్ళతో తన్నినా
పెరిగి పెద్దయ్యాక గుండెపై తన్నినా
నీ గుండె గూటిలో మము దాచుకున్నావు
కొండంత మనసుతో దీవించినావు
బతుకంతా మాకై ధారబోసినావు
అమ్మా... అమ్మా... అమ్మా ఓ మాయమ్మ
మముగన్న మాయమ్మ మా తల్లి లచ్చమ్మ
జన్మంతా మొక్కినా నీ ఋణం తీర్చలేమమ్మా
జన్మంతా మొక్కినా నీ ఋణం తీర్చలేమమ్మా

పురిటిలో నీ తనువు పుండాయనమ్మ
మా ఆకలి పాల కుండాయనమ్మ
మలమూత్రములనెత్తి మసివారినావు
మల్లెలోనే మాకు వన్నె దిద్దినావు
నీ కంటిపాపలే మా దిష్టి పూసలై
పర దిష్టి పడకుండా దిగదూడ్చినాయి
నీ చల్లని చూపే మా కళ్ళ వెలుగు
అమ్మా... అమ్మా... అమ్మా ఓ మాయమ్మ
మముగన్న మాయమ్మ మా తల్లి లచ్చమ్మ
జన్మంతా మొక్కినా నీ ఋణం తీర్చలేమమ్మా
జన్మంతా మొక్కినా నీ ఋణం తీర్చలేమమ్మా

తాగేటి నీరులోన నాచుండు గానీ
తల్లి చనుబాలలో ఏ కల్తీ లేదు
తియ్యటి పండులోన జీడున్న గానీ
కన్నతల్లి కడుపు వెన్నముద్దోయమ్మ
చల్లని జాబిలిలో మసక ఉన్న గానీ
ఏ మచ్చ లేనిది తల్లి ప్రేమోయమ్మ
అమ్మంత స్వచ్ఛమైనదేదిరా

అమ్మా... అమ్మా... అమ్మా ఓ మాయమ్మ
మముగన్న మాయమ్మ మా తల్లి లచ్చమ్మ
జన్మంతా మొక్కినా నీ ఋణం తీర్చలేమమ్మా
జన్మంతా మొక్కినా నీ ఋణం తీర్చలేమమ్మా



Credits
Writer(s): Goranti Venkanna, Shaik Imam
Lyrics powered by www.musixmatch.com

Link