Channubalu Thagithene

చనుబాలు తాగితేనే బ్రతుకు తీపి తెలిసింది
ఆరు రుచులు తగలగానే అమ్మే చేదవుతుంది
చనుబాలు తాగితేనే బ్రతుకు తీపి తెలిసింది
ఆరు రుచులు తగలగానే అమ్మే చేదవుతుంది
రొమ్మేగా... రొమ్మేగా అందించెను జీవితాన్ని నోటికి
అమ్మేగా తన నెత్తురు నింపెను నీ ఒంటికి
ఎవరు రాయగలరు "అమ్మ" అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు "అమ్మ" అను రాగంలా తియ్యని రాగం

ఆలైనా బిడ్డలైనా ఒకరు పొతే ఇంకొకరు
అమ్మ పదవి ఖాళీ అయినా, అమ్మ అవరు ఇంకెవరూ
ఆలైనా బిడ్డలైనా ఒకరు పొతే ఇంకొకరు
అమ్మ పదవి ఖాళీ అయినా, అమ్మ అవరు ఇంకెవరూ
అమ్మంటే... అమ్మంటే విరమించని వట్టి వెట్టి చాకిరీ
అమ్మంటే రాజీనామా ఎరగనీ ఈ నౌకరి
ఎవరు రాయగలరు "అమ్మ" అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు "అమ్మ" అను రాగంలా తియ్యని రాగం



Credits
Writer(s): Dasari Narayana Rao, Sirivennela Sitarama Sastry, Chakravarthy
Lyrics powered by www.musixmatch.com

Link