Idhi Rana Rangama

ఇది రణరంగమా లేక అగ్ని గుండమా విధి నడిపే ప్రేమ అర్ధమవదే
ఇది రణరంగమా లేక అగ్ని గుండమా విధి నడిపే ప్రేమ అర్ధమవదే

అగ్ని కణము నీటి గుణము రెంటిని కలిపితే నువ్వేనా
ఇవతలి వైపు దేవతవైతే అవతలి వైపు దెయ్యమువా
సమయం తింటావ్ మెదడుని తింటావ్ నన్నే తింటావ్ తప్పు కాదా
పని పాట లేని పిల్లా ఇంట్లో నీకు తిండి లేదా
చూపులు తగలగ మాటలు పెగలగ ఉరుములు మెరుపులు ఆరంభం
పాదం కేశం నాభి కమలం రగులు కొనగా ఆనందం
ధగ ధగమని వెలిగెను జ్వాల సెగ సెగమని ఎగిరెను బాలా
తహతహమని తపనల గోల కసి కసియని కౌగిలి ఏలా

మిత్రుల బృందం ఎదురే వస్తే పక్కకి తొలగి నడిచితిని
పొద్దుట నిన్ను చూస్తానంటూ రాత్రినంతా గడిపితిని
ఇట్టా ఇట్టా రోజులు గడవగ ఇంకా నన్నేం చేస్తావు
మాయా మంత్రం తెలిసిన దానా త్వరగా నన్ను చంపెదవా
ఏ తాడైనా నీ తలపుల్ని బిగిసేలాగ కడుతుందా
నన్నే కాల్చగ ఎముకల గూడు నీ పేరేగా చెబుతుంది
చిటపటమని చిందేస్తావా వదులొదులని విదిలిస్తావా
దడదడమని జడిపిస్తావా ఒంటరిగా వదిలేస్తావా

ఇది రణరంగమా లేక అగ్ని గుండమా విధి నడిపే ప్రేమ అర్ధమవదే



Credits
Writer(s): Yuvan Shankar Raja, A M Rathnam
Lyrics powered by www.musixmatch.com

Link