Ra Rakumara (From "Govindudu Andarivaadele")

రా రా కుమారా రాజసాన ఏలగా
యదపై చేరనీరా పూలమాలె నేనుగా
నీవు తీసె శ్వాసలో ఊయలూగే ఆశతో
పంపుతున్నా నా ప్రాణాన్ని నీ వైపుగా

నీ తలపులతో మరిగిపోయె ఒంటరి తనమూ ఇష్టమే
నీ కబురులతో కరిగిపోయె ప్రతి ఒక క్షణమూ ఇష్టమే
కలలే నిజమయేలా కళ్లు తెరిచిన కోరిక ఇష్టం
నిజమే కల అయేలా ఒళ్లు మరచిన అయోమయం మరింత ఇష్టం

రా రా రాకుమారా రాజసాన ఏలగా
యదపై చేరనీరా పూలమాలె నేనుగా

బరువనిపించే బిడియమంతా నీ చేతులలో వాలనీ
బతకడమంటే ఎంత మధురం నీ చేతలలో తెలియనీ
నేనేం చేసుకోను నీకు పంచని ఈ హృదయాన్ని
ఇంకేం కోరుకోను నిన్ను మించిన మరోవరం ఏదైనా గానీ



Credits
Writer(s): Yuvan Shankar Raja, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link