Manasu Palike

మనసు పలికే భాష ప్రేమ
మౌనమడిగే బదులు ప్రేమ
మరణమైనా తోడు ప్రేమ
మనకి జరిగే మాయ ప్రేమ
మనకి జరిగే మాయ ప్రేమ

గుండెలో వ్యథలనే కాల్చు మంటే ప్రేమ
రగిలిన సెగలనే ఆర్పునది ఈ ప్రేమ
ఆదియూ అంతమూ లేని పయనం ప్రేమ
వేకువై చేరునే చీకటింట్లో ప్రేమ
విశ్వమంతా ఉన్న ప్రేమ, ఇరుకు ఎదలో దాచగలమా?

కాటిలో కాలదు తుదిలేని ఈ ప్రేమ
జన్మనే కోరదు అమ్మెరుగదీ ప్రేమ
దొరకదా వెతికితే కడలైనా కన్నీట
తరమగా దాహమే నీరల్లే ఓ ప్రేమ
నీడనిచ్చే వెలుగుతోడు, చీకటైతే ఏమికాను?



Credits
Writer(s): Rakendu Mouli, Rajamanickam C
Lyrics powered by www.musixmatch.com

Link