Mellaga Mellaga (Female Version) [From "Asha Asha Asha"]

మెల్లగ మెల్లగ తట్టి మేలుకో మేలుకోమంటూ
తూరుపు వెచ్చగా చేరంగా
సందె సూర్యుడే సూటిగా వచ్చి
చిలిపిగా చెంపనే గిచ్చి
తలపులు తలుపులు తీయంగా
ఎగిరే పావురం తీరుగా
మనసే అంబరం చేరగా
కల మేలుకున్నది ఇల నేలుతున్నది
మెల్లగ మెల్లగ తట్టి మేలుకో మేలుకోమంటూ
తూరుపు వెచ్చగా చేరంగా

చిట్ చిట్ చిట్ చిట్ చిట్ చిట్ చిట్
చిట్టి పొట్టి పిచుకా
చిత్రంగా ఎగిరే రెక్కలు ఎవరిచ్చారు
పట్ పట్ పట్ పట్ పట్
పరుగుల సీతాకోకా
పదహారు వన్నెలు నీకు ఎవరిచ్చారు
చిన్ని చిన్ని రేకుల పూలన్నీ
ఆడుకుందాo రమ్మన్నాయయి తలలూపి
కొమ్మ మీది కోయిలమ్మ నన్ను చూసి
పాడుతుంది గొంతు కాస్త శృతి చేసి
మధు మాసమై ఉంటే ఎద
సంతోషమే కదా సదా
అమ్మమ్మా మబ్బుల తలుపులున్న వాకిలి
తీసి రమ్మంటుంది నింగి లోగిలి

మెల్లగ మెల్లగ తట్టి మేలుకో మేలుకోమంటూ
తూరుపు వెచ్చగా చేరంగా

తుళ్ తుళ్ తుళ్ తుళ్ తుళ్ తుళ్ తుళ్
తుళ్లే ఉడత
మెరుపల్లే ఉరికే వేగం ఎవరిచ్చారు
జల్ జల్ జల్ జల్ జల్ జల్
జల పారే యేరా ఏవరమ్మా
నీకీ రాగం నేర్పించారు
కొండతల్లి కోనకిచ్చు పాలేమో
నురుగుల పరుగుల జలపాతం
వాగు మొత్తం తాగే దాకా తగ్గదేమో
ఆశగ ఎగిరే పిట్ట దాహం
మధు మాసమై ఉంటే ఎద
సంతోషమే కదా సదా
అమ్మమ్మా మబ్బుల తలుపులున్న వాకిలి
తీసి రమ్మంటుంది నింగి లోగిలి

మెల్లగ మెల్లగ తట్టి మేలుకో మేలుకోమంటూ
తూరుపు వెచ్చగా చేరంగా
సందె సూర్యుడే సూటిగా వచ్చి
చిలిపిగా చెంపనే గిచ్చి
తలపులు తలుపులు తీయంగా
ఎగిరే పావురం తీరుగా
మనసే అంబరం చేరగా
కల మేలుకున్నది ఇల నేలుతున్నది

పా ప పా పా ప పా మ గ మా మ మా మా మ మా గ రి
గా గ గా గా గ గా రి స రి
పా ప పా పా ప పా మ గ మా మ మా మా మ మా గ రి
గా గ గా గా గ గా రి స రి



Credits
Writer(s): Srikanth Deva, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link