Dheerasameere Yamuna (From "Dharmachakram")

ధీర సమీరే యమునా తీరే
వసతివనే వనమాలి
గ్రామ సమీపే ప్రేమ కలాపే
చెలి తగునా రస కేళి
ఆకాశమే నా హద్దుగా
నీ కోసం వచ్చా ముద్దుగా
తెచ్చానురా మెచ్చనురా గిచ్చేయి
నచ్చిన సొగసులు
ధీర సమీరే యమునా తీరే
వసతివనే వనమాలి
గ్రామ సమీపే ప్రేమ కలాపే
చెలి తగునా రస కేళి

వేసంగి మల్లెల్లో శీతంగి వెన్నెల్లో
వేసారి పోతున్నారా రారా
హేమంత మంచుల్లో ఏకాంత మంచంలో
వేటాడుకుంటున్నానే నిన్నే
మొటిమ రగులు సెగలో
తిరగబడి మడమ తగులు వగలో
చిగురు వణుకు చలిలో
మదనుడికి పొగరు పెరిగే పొదలో
గోరింట పొద్దుల్లోన పేరంటాలే ఆడే వేళ
ధీర సమీరే యమునా తీరే
వలచితి నే వనమాలి
గ్రామ సమీపే ప్రేమ కలాపే
ప్రియ తగునా రస కేళి

లేలేత నీ అందం
నా గీత గోవిందం
నా రాధ నీవే లేవే రావే
నీ గిల్లికజ్జాలు జాబిల్లి వెచ్చాలు
నా ఉట్టి కొట్టేస్తున్నా రావా
వయసు తెలిసే ఒడిలో
ఎద కరిగి తపన పెరుగు తడిలో
మనువు కుదిరే మదిలో
ఇంకిపుడు చనువు ముదురు గదిలో
వాలారు సందెల్లోన వయ్యారాలే తాకే వేళ
ధీర సమీరే యమునా తీరే
వలచితి నే వనమాలి
గ్రామ సమీపే ప్రేమ కలాపే
ప్రియ తగునా రస కేళి
ఆకాశమే నా హద్దుగా
నీ కోసం వచ్చా ముద్దుగా
తెచ్చానురా మెచ్చానురా గిచ్చేయి
నచ్చిన సొగసులు

ధీర సమీరే యమునా తీరే
వసతివనే వనమాలి
గ్రామ సమీపే ప్రేమ కలాపే
చెలి తగునా రస కేళి



Credits
Writer(s): Veturi, M.m. Srilekha
Lyrics powered by www.musixmatch.com

Link