Chukkalle Thochave (From "Nereekshana")

చుక్కల్లే తోచావే, వెన్నెల్లే కాచావే, ఏడ బోయావే
ఇన్ని వేల చుక్కల్లో నిన్ను నేనెతికానే
ఇన్ని వేల చుక్కల్లో నిన్ను నేనెతికానే
చుక్కల్లే తోచావే, వెన్నెల్లే కాచావే, ఏడ బోయావే

పూసిందే ఆ పూలమాను నీ దీపంలో
కాగిందే నా పేద గుండె నీ తాపంలో
ఊగానే నీ పాటలో ఉయ్యాలై
ఉన్నానే ఈనాటికీ నేస్తాన్నై
ఉన్నా ఉన్నాదొక దూరం ఎన్నాళ్ళకు చేరం తీరందీ నేరం

చుక్కల్లే తోచావే, వెన్నెల్లే కాచావే, ఏడ బోయావే

తానాలే చేశాను నేను నీ స్నేహంలో
ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో
ఆనాటి నీ కళ్ళలో నా కళ్ళే
ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే
ఉందా కన్నీళ్ళకు అర్థం ఇన్నేళ్ళుగ వ్యర్థం చట్టందే రాజ్యం

చుక్కల్లే తోచావే, వెన్నెల్లే కాచావే, ఏడ బోయావే
ఇన్ని వేల చుక్కల్లో నిన్ను నేనెతికానే
ఇన్ని వేల చుక్కల్లో నిన్ను నేనెతికానే
చుక్కల్లే తోచావే, వెన్నెల్లే కాచావే, ఏడ బోయావే

Credits
Writer(s): Ilayaraja, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link