Konda Kona (From "Soggadi Pellam")

కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్య పైన
కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్య పైన
సీత సర్వము రామ పాదము
రామ చంద్రుడే సీత ప్రాణము
ఆ రామయ్య సీతమ్మ అనురాగ బంధం ఎంత మధురము
కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్య పైన

నీలాగా ద్రౌపదుంటే
ధర్మరాజు జూదరిగా పేరొందునా
భారతాన యుద్ధమునకు తావుండునా
లోపమంటు లేనివాడు
లోకమందు ఉండబోడు ఏ ఒక్కడు
తప్పు దిద్దుకున్న వాడే ఆ దేవుడు
నీ సహనానికి నా భాష్పాంజలి
నీ హృదయానికి ఇది పుష్పాంజలి
ఏ దేవుళ్ళు దిగివచ్చి దీవించినారో నోము పండెను
కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్య పైన
రాయల్లె ఉన్నా ఈ రామయ్య పైన

కన్ను కాచే రెప్ప నీవే
ఆకలైన వేల అమ్మలాలింతువే
కన్ను చమ్మ గిల్లు వేల చెల్లెమ్మవే
కంటి చమ్మ చూడలేని
తోడు నీడ వీడలేని ఇల్లాలిని
జన్మ జన్మ నందు నేను నీ దానిని
ఈ జగమంతటా నిను తిలకించని
నీ సగ భాగమై నను తరియించని
నా బంగారు కలలన్నీ ఫలించి ఇల్లే స్వర్గమైనది
కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్య పైన
సీత సర్వము రామ పాదము
రామ చంద్రుడే సీత ప్రాణము
ఆ రామయ్య సీతమ్మ అనురాగ బంధం ఎంత మధురము
కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్య పైన
రాయల్లె ఉన్నా ఈ రామయ్య పైన



Credits
Writer(s): Raj-koti, Sai Sri Harsha
Lyrics powered by www.musixmatch.com

Link